రైల్వే రిజర్వేషన్ టికెట్ బదిలీ చేసుకోవచ్చు ఇలా..!

23 Aug, 2021 15:24 IST|Sakshi

చాలా సార్లు మనం కొన్ని అనివార్య కారణాల వలన రైల్వే ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో మనం మన రిజర్వేషన్ టికెట్ ను రద్దు చేసుకుంటాము. అలా కాకుండా మీ టికెట్ ను మీ బందువుల పేరు మీదకు బదిలీ చేసే అవకాశం ఉంది అని మనలో ఎంత మందికి తెలుసు. అవును మీ దగ్గర రిజర్వేషన్ టికెట్ ఉంది ప్రయాణించలేని సమయాల్లో టికెట్ ని మీ కుటుంబ సభ్యుల పేరు మీదకు బదిలీ చేయవచ్చు.(చదవండి: చక్కెర ఎగుమతులపై తాలిబన్‌ ఎఫెక్ట్‌?)

ఇక్కడ కుటుంబం అంటే తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, కుమారుడు, కుమార్తె, భర్త లేదా భార్య. మీ టికెట్ బదిలీ చేయడం కోసం రైలు బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందు మీరు అధికారులకు ఒక అర్జీ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ టికెట్ పై ఉన్న పేరును తొలగించి వేరే వ్యక్తి పేరు మీదకు బదిలీ చేస్తారు. కానీ, ఈ అవకాశం ఒకసారి మాత్రమే ఉంటుంది. అంటే, ప్రయాణీకుడు తన టికెట్ ను మరొక వ్యక్తికి ఒకసారి బదిలీ చేసినట్లయితే ఆ తర్వాత మరెవరికీ బదిలీ చేయలేము.

రిజర్వేషన్ టికెట్ ఎలా బదిలీ చేయాలి

  • రైల్వే రిజర్వేషన్ టికెట్ ప్రింట్ అవుట్ తీసుకోని దగ్గరల్లో ఉన్న రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కేంద్రానికి వెళ్లండి.
  • మీ ఆధార్/ ఓటర్ ఐడీ గుర్తింపు కార్డును రిజర్వేషన్ కేంద్రానికి తీసుకుని వెళ్ళండి.
  • అలాగే మీ టికెట్ బదిలీ చేయాలని అనుకుంటున్న వ్యక్తి గుర్తింపు ఐడీ కార్డును తీసుకెళ్లండి. 
  • రైల్వే రిజర్వేషన్ కౌంటర్ దగ్గర టికెట్ బదిలీ కోసం రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకోండి.

టికెట్ బదిలీ చేయాలనుకునే వ్యక్తి స్టేషన్ మేనేజర్/చీఫ్ రిజర్వేషన్ సూపర్ వైజర్ ని సంప్రదించాలి. బదిలీ చేయాలని అనుకుంటున్న వ్యక్తి రేషన్ కార్డు, ఓటర్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్ మొదలైన వాటితో పాటు ఆ వ్యక్తితో గల సంబంధాన్ని తెలిపే ఫోటో కాపీని కూడా అతడికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు