హైదరాబాద్ టూ అమెరికా: ఇలా చేస్తే తక్కువ ధరకే విమాన టికెట్లు!

14 Sep, 2023 12:33 IST|Sakshi

విమాన టికెట్లు తక్కువ  ధరలో వస్తే బాగుండు అనుకుంటున్నారా?

ఇలా  చేస్తే తక్కువ ఖర్చుతో అమెరికా ఎగిరిపోవచ్చు

ముందస్తు ప్లానింగ్‌తో  మేలైన  ప్రయాణం

అమెరికా వెళ్లే ప్రయాణికులు కాస్త ముందస్తు ప్లానింగ్ చేసుకుంటే తక్కువ ఖర్చుతో  అమెరికా ప్రయాణం చేయొచ్చు.  సాధారణంగా రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల  నుండి అమెరికాకు ప్రయాణం చేసే వారి సంఖ్య  లక్షల్లో ఉంటుంది. మాములుగా అమెరికా వెళ్లే ప్రయాణికులు  ఆన్ లైన్ లో  తమకు నచ్చిన వెబ్ సైట్ లో అమెరికా వెళ్లేందుకు టికెట్ రేట్ ఎంత ఉందో ప్రయాణానికి కొన్ని రోజుల ముందు ప్లాన్ చేసుకుంటారు. మరికొంత మంది అయితే ఎక్కువ స్టాప్స్ ఉండే ఫ్లైట్ లను ఎంచుకుంటే తక్కువ ధర లో టికెట్ దొరుకుతుందని వెదుకుతారు. అలా సాధారణంగా ట్రై చేయకుండా మేం చెప్పే విధంగా ట్రై చేస్తే మీరు తక్కువ ఖర్చుతోనే అమెరికా వెళ్లొచ్చు.

సాధారణంగా అయితే అమెరికా లోని న్యూయార్క్ నగరానికి వెళ్లాలనుకుంటున్న ప్రయాణికులు  హైదరాబాద్ నుండి న్యూయార్క్ కి టికెట్ బుక్ చేసుకుంటే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి ముంబై వరకు డొమెస్టిక్ ఫ్లైట్ లో తీసుకువెళ్లి అక్కడి నుండి ఇస్తాంబుల్ వరకు ఇంటర్ నేషనల్ ఫ్లైట్ తీసుకువెళ్లి మళ్లి అక్కడ కనెక్టింగ్ ఫ్లైట్ లో న్యూయార్క్ కి చేరుకుంటారు. ఇలా అయితే సాధారణ ప్రయాణం కోసం టికెట్ బుక్ చేసుకుంటే  ఇండిగో ఎయిర్ లైన్స్ అయితే సుమారు  లక్ష రూపాయల నుండి లక్షన్నర వరకు టికెట్ చార్జ్ అవుతుంది. 
   
ఇలా  ట్రై చేయండి, బోలెడంత డబ్బు ఆదా

హైదరాబాద్ నుండి న్యూయార్క్ కి  కొన్ని ప్రయోగాలు చేస్తే మీరు చాలా తక్కువ ఖర్చుతో నే అమెరికా వెళ్లొచ్చు. అది ఎలా అంటే మొదట హైదరాబాద్ నుండి నేరుగా దుబాయ్ కి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే ఒక ప్రయాణికునికి ఒక నెల ముందు టికెట్ తీసుకుంటే సుమారు 10వేల నుండి 12వేల వరకు ఛార్జ్ అవుతుంది.  దుబాయ్ నుండి న్యూయార్క్ కి టికెట్ సెపరేట్ గా బుక్ చేసుకుంటే  సుమారు  43వేల నుండి 48 వేలల్లోనే టికెట్ లభిస్తుంది.  మొత్తం కలిపితే  రూ. 60 వేలు మాత్రమే అవుతుంది.  దీంతో హైదరాబాద్ నుండి ముంబై మీదుగా ఇస్తాంబుల్ నుండి న్యూయార్క్ వెళితే ఒకలక్ష 25వేల నుండి లక్షన్నర వరకు అయ్యే ఖర్చు… అదే దుబాయ్ వెళ్లి అక్కడి నుండి న్యూయార్క్ కి బుక్ చేసుకుంటే కేవలం 60 వేల నుండి 70వేల తక్కువ ధరతోనే ప్రయాణం కంప్లీట్ అవుతుంది. ఇలా చేయడంతో వెయిటింగ్ పీరియడ్ తప్పడంతో పాటు ఇతర దేశాలను చూసే  వీలు కూడా ఉంటుంది. కాకపోతే అరైవల్ ఆన్ వీసా ఉన్న దేశాలకు అయితే మీకు సులంభంగా అవుతుంంది. లేకుంటే  వీసా దేశాలు అయితే మళ్లీ వీసా కోసం సెపరేట్ గా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

మరొక విధంగా ట్రై చేయాలనుంటే

అమెరికాలోని న్యూయార్క్ వెళ్లానుకుంటే  ముందుగా హైదరాబాద్ నుండి శ్రీలంక దేశ రాజధాని కొలంబోకు టికెట్ బుక్ చేసుకుంటే  ఒక వ్యక్తికి సుమారు 11వేల రూపాయల్లో టికెట్ వస్తుంది.  కొలంబో నుండి న్యూయార్క్ కి టికెట్ బుక్ చేసుకుంటే  సుమారు 56వేల రూపాయాల్లోనే టికెట్ దొరుకుతుంది. అంటే సుమారు 67వేల రూపాయలతో అమెరికాలోని న్యూయార్క్ కి చేరుకోవచ్చు. అదేవిధంగా శ్రీలంక దేశం కూడా చూసినట్లవుతుంది. కాబట్టి కొంచెం ట్రిక్కులు ప్లే చేస్తే ఇతర దేశాలను చూసినట్లుంటుంది తక్కువ ఖర్చుతోనే ప్రయాణం కంప్లీట్ అవుతుంది.

-మంగ వెంకన్న, సాక్షి టీవీ

మరిన్ని వార్తలు