ఇక రెండుగా ఐబీఎం..

10 Oct, 2020 06:17 IST|Sakshi

ప్రత్యేక సంస్థగా ‘మేనేజ్డ్‌ ఇన్‌ఫ్రా సేవలు’

న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజం ఐబీఎం తన వ్యాపార కార్యకలాపాలను రెండుగా విభజించనుంది. ఇందులో భాగంగా మేనేజ్డ్‌ ఇన్‌ఫ్రా సేవల విభాగాన్ని ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేయనుంది. ఇకపై ఐబీఎం పూర్తిగా హైబ్రీడ్‌ క్లౌడ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మొదలైన వ్యాపారాలపై దృష్టి పెట్టనుండగా, రెండో సంస్థ సర్వీస్‌ డెలివరీ, ఆటోమేషన్‌ తదితర విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహించనుంది. ఈ ప్రక్రియ 2021 ఆఖరు నాటికి పూర్తి కావచ్చని అంచనా. తాత్కాలికంగా ’న్యూకో’ పేరుతో వ్యవహరిస్తున్న ఇన్‌ఫ్రా సేవల విభాగానికి భారత్‌లోని ఉద్యోగుల్లో సుమారు మూడో వంతు సిబ్బందిని బదలాయించనున్నట్లు ఐబీఎం సీఈవో అరవింద్‌ కృష్ణ తెలిపారు. 2019 ఆఖరు నాటికి ఐబీఎంలో మొత్తం 3.83 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. దేశాలవారీగా ఉద్యోగుల సంఖ్యను కంపెనీ వెల్లడించనప్పటికీ.. భారత్‌లో సుమారు 1 లక్ష పైచిలుకు సిబ్బంది ఉంటారని అంచనా.  

మరిన్ని వార్తలు