ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..!

23 Jan, 2022 13:00 IST|Sakshi

ఐసీఐసీఐ బ్యాంక్ తన ఫిక్సిడ్ డిపాజిట్ ఖాతాదారులకు శుభవార్త అందించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మాదిరిగానే ఐసీఐసీఐ బ్యాంక్ ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. తాజా ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ రేట్లు జనవరి 20 నుంచి అమలులోకి వస్తాయి. ఇప్పటికే ప్రైవేట్ బ్యాంకులతో పాటు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా & కెనరా బ్యాంక్ వంటి ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు కూడా ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచాయి. మరిన్ని బ్యాంకులు ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచేందుకు సిద్దం అవుతున్నాయి.

ఐసీఐసీఐ బ్యాంక్ తన అధికారిక పోర్టల్లో వడ్డీ రేట్లకు సంబంధించన కొత్త జాబితాను ప్రకటించింది. సాదారణ ఖాతాదారులతో పోలిస్తే సీనియర్ సిటిజన్స్ కి బ్యాంకు ఐదేళ్ల కాలపరిమితితో కూడిన టర్మ్ డిపాజిట్లపై ఎక్కువగా 0.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఎన్ఆర్ఐ సీనియర్ సిటిజన్స్ కి అదనంగా వడ్డీ రేటు లభించదు. కొత్త ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

(చదవండి: ఆహా! ఏమి అదృష్టం.. 3 నెలల్లో ఏకంగారూ.2.4 కోట్లు లాభం!)

మరిన్ని వార్తలు