Pulsar Bike Maker Rajiv Bajaj Story: పల్సర్‌ బైకా? మజాకా..రూ.35 వేల కోట్ల ఆస్తి..ఎవరా హీరో?

4 Aug, 2023 12:16 IST|Sakshi

యూత్‌ డ్రీమ్‌ బైక్‌ ఏదీ అంటే పల్సర్‌ బైక్‌ ఒకటి అని కచ్చితంగా చెప్పవచ్చు. అలాంటి ఐకానిక్ పల్సర్ బైక్‌ను భారత దేశంలో పరిచయం చేసిన బిలియనీర్, రాహుల్ బజాజ్ కుమారుడు రాజీవ్‌ బజాజ్‌. కుటుంబ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చిన రాజీవ్ బజాజ్ పల్సర్ లైన్ మోటార్ బైక్‌లను లాంచ్‌ చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. యువతరం అభిరుచులకు అనుగుణంగా ఇవి రావడంతో బజాజ్‌ కష్టతరమైన వ్యాపారాన్ని మలుపు తిప్పింది. బజాజ్ ఆటో సీఎండీ రాజీవ్ నికర విలువ తదితర విశేషాలు తెలుసుకుందాం! (తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ)

ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ పెద్ద కుమారుడు.  90వ దశకం చివరలో తన కుటుంబ వ్యాపారంలో చేరినప్పుడు, దేశీయ తిరుగులేని ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ కష్టాల్లో ఉంది. అంతర్జాతీయ జాయింట్ వెంచర్ కంపెనీలచే తయారైన మోటార్‌సైకిళ్లను నెమ్మదిగా కోల్పోతోంది. ఈ సమయంలో రాజీవ్ తన సొంత మోటార్‌సైకిళ్లను తయారీపై ఫోకస్‌ పెట్టారు. అలా  బజాజ్  పల్సర్  మార్కెట్‌లోకి వచ్చింది. ఇక అప్పటినుంచి  టూ వీలర్‌ మార్కెట్‌లో  దూసుకుపోతున్నారు. (కొత్త సేఫ్టీ ఫీచర్లు, షాకింగ్‌ ధర: 2023 టయోటా వెల్‌ఫైర్‌)

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో. మహాత్మా గాంధీ ఆరాధకుడైన జమ్నాలాల్ బజాజ్ (రాజీవ్‌ ముత్తాత) 1926లో ఈ  సంస్థను స్థాపించారు.  ఆతరువాత దివంగత రాహుల్ బజాజ్( రాజీవ్ తండ్రి) ఫిబ్రవరి 2022లో మరణించే వరకు ప్రముఖ బజాజ్ గ్రూప్‌కు ఎమెరిటస్ ఛైర్మన్‌గా పనిచేశారు. 2001లో భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమనం, స్టాక్ మార్కెట్ పతనం ఇది కంపెనీపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఒకదశలో బజాజ్ ఆటో త్వరలో మూసివేయబడుతుందని అంచనాలుకూడా వచ్చాయి. ప్రస్తుతం సీఎండీగా రాజీవ్‌ కంపెనీని విజయ పథంలో నడిపిస్తున్నారు. కంపెనీ కొత్త లాంచింగ్స్‌, టెక్నాలజీని అందిపుచ్చుకుని కంపెనీని అభివృద్ధిలో  నడిపిస్తున్నారు. ద్విచక్ర వాహనం, బజాజ్‌ఫిన్‌ సర్వ్‌(ఆర్థిక సేవలు), ఎలక్ట్రికల్ ఉపకరణాల పరిశ్రమలతో సహా 40 వ్యాపారాలు ఈ రోజు బజాజ్ గ్రూప్‌లో ఉన్నాయి. 

రాజీవ్ బజాజ్ ఎవరు?
1966 డిసెంబర్ 21న  రాజీవ్ బజాజ్ జన్మించారు. 2005లో బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కష్టాల్లో ఉన్న వ్యాపారాన్ని మలుపు తిప్పిన ఘనతను సాధించిన పల్సర్ లైన్ మోటార్‌బైక్‌లతో పాటు తాజాగా ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు) సహా కొత్త ఉత్పత్తులతో ప్రతిభను చాటు కుంటున్నారు. పూణేలోని అకుర్డిలో, రాజీవ్ బజాజ్ సెయింట్ ఉర్సులా ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఆ తరువాత 1988లో పూణే విశ్వవిద్యాలయం మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీని, 1990లో వార్విక్ విశ్వవిద్యాలయం నుండి మాన్యుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు

బజాజ్ ఆటోకు తయారీ, సరఫరా గొలుసు (1990-95), R&D,ఇంజనీరింగ్ (1995-2000), మార్కెటింగ్  అండ్‌ సేల్స్ (2000-2005) విభాగాల్లో సేవలందించారు.  ఏప్రిల్ 2005 నుండి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా  ఉన్నారు. ఫోర్బ్స్ ప్రకారం 2022లో రాజీవ్ బజాజ్ నికర విలువ రూ. 35,600 కోట్లు (4.3 బిలియన్లు డాలర్లు). రాజీవ్‌కు యోగా అన్నా హోమియోపతీ వైద్య విధానం అన్నా చాలా ఇష్టమట. రాజీవ్ బజాజ్‌కి ఇష్టమైన సినిమా సన్నివేశాలలో ఒకటి చాలా ఆసక్తి కరం. 2004 నాటి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ట్రాయ్ మూవీ ప్రారంభ సన్నివేశం అంటే ఇష్టం. ఈ దృశ్యాన్ని తన సహోద్యోగులకు చూపించి మరీ కంపెనీని ముందుకు తీసుకుపోయేలా ప్రోత్సహిస్తారట. గొప్ప యోధునిగా గుర్తుంచుకోవడానికి గ్రీకు యోధుడు ఎచిల్లీస్‌ (బ్రాడ్‌పిట్‌ హీరో) పడిన తపనను గుర్తు చేసేవారట.

బజాజ్ ఫిన్‌సర్వ్ లిమిటెడ్‌ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్, రాజీవ్‌ సోదరుడు సంజీవ్‌  కూడా బిలియనీరే. రాహుల్ బజాజ్ చిన్న కుమారుడు సంజీవ్ బజాజ్దక్షిణ ముంబైలోని అత్యంత విలాసవంతమైన రూ.104 కోట్ల విలువైనఅపార్ట్‌మెంట్లను కొనుగోలు చేయడం విశేషం. భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబాలలో బజాజ్ కుటుంబం ఒకటి.

ఆ బ్యాంకును దోచుకోక తప్పదు
రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఆధిపత్య సెగ్మెంట్‌లో పోటీపై స్పందించిన రాజీవ్‌  ప్రముఖ అమెరికన్ దొంగ విలియం సుట్టన్ ఉదాహరణతో  తన కంపెనీ ఎత్తుగడలను సమర్థించుకోవడం గమనార్హం. అమెరికాలో విలియం ఫ్రాన్సిస్ సుట్టన్ అనే ప్రసిద్ధ బ్యాంకు దోపిడీదారుడున్నాడు. మీరు బ్యాంకును ఎందుకు దోచుకుంటున్నారు అని అడిగినప్పుడు డబ్బు అక్కడే ఉంది కాబట్టి అని చెబుతాడు.. అలాగే రాయల్ ఎన్‌ఫీల్డ్ డబ్బు ఎక్కడ ఉంటే ఆ బ్యాంకును దోచుకోవడం తప్ప తమకు వేరే మార్గం లేదని చెప్పుకొచ్చారు రాజీవ్‌ బజాజ్‌. (విలియం ఫ్రాన్సిస్ సుట్టన్ నలభై సంవత్సరాలలో రెండు మిలియన్ డాలర్లకు పైగా దోచుకున్నాడు)

రాహుల్‌ బజాజ్‌
1965లో రాహుల్ బజాజ్ బజాజ్ గ్రూప్ పగ్గాలు చేపట్టిన సంవత్సరానికి కొత్త శిఖరాలకు చేర్చారు. బజాజ్ ఆటో ఆదాయం రూ.72 మిలియన్ల నుండి రూ.46.16 బిలియన్లకు పెరిగింది. భారతదేశంలోని అత్యుత్తమ సంస్థల్లో ఒకదానిగా తీర్చిదిద్దడంలో ఆయనకృషి చాలా ఉంది. ఫోర్బ్స్ ఇండియా ప్రకారం దేశంలోని 20వ అత్యంత సంపన్నుడిగా నిలిచారు. రాహుల్‌బజాజ్‌ 2002లో, దేశీయ మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్‌ను అందుకున్నారు. 83 ఏళ్ల వయసులో 2022 లో  ఆయన కన్నుమూశారు.

మరిన్ని వార్తలు