రిచెస్ట్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌ ఎవరో తెలుసా? గ్లోబల్‌ సెలబ్రిటీలు ఆమె కస్టమర్లు

1 Nov, 2023 11:37 IST|Sakshi

సాధించాలన్న పట్టుదల ఉండాలి. వృత్తి పట్ల ప్రేమ,నిబద్ధత ఉండే చాలు..ఎన్నిఅడ్డంకుల్నైనా అధిగమించి విజయ బావుటా ఎగుర వేయొచ్చు. సవాళ్లు ఎన్ని వచ్చినా  దారిలో ముళ్లను ఏరి పారేసినట్టు వాటిని అధిగమించి శభాష్‌ అనిపించు కోవచ్చు. స్ఫూర్తినిచ్చే అద్భుతమైన విజయాన్ని అందుకున్న  అద్భుత మహిళ గురించి తెలుసుకుందాం. కుట్టు మిషన్‌తో ఏం సాధిస్తాంలే అనుకోలేదు. కేవలం రెండే రెండు కుట్టు మిషన్లతో ప్రారంభించి కోట్లకు అధిపతిగా అవతరించిన అనితా డోంగ్రే సక్సెస్‌ జర్నీ ..

తను చేసేపని పట్ల స్పష్టమైన దృక్పథం , అంతకుమించిన నిబద్ధత, మారుతున్న అభిరుచులకు అనుగుణంగా మల్చుకుని తానేంటో అనితా డోంగ్రే నిరూపించుకున్న వైనం  స్ఫూర్ది దాయకం. అవమానాల్నికూడా లెక్క చేయకుండా రెండు దశాబ్దాల కృషితో దేశవ్యాప్తంగా 270కి పైగా షాపుల నెట్‌వర్క్‌తో , వందల కోట్ల సంపదతో అనితా డోంగ్రే భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళా ఫ్యాషన్ డిజైనర్‌గా రాణించారు.

A post shared by Anita Dongre (@anitadongre)

అమ్మేప్రేరణ, ఆది గురువు
అనితా డోంగ్రే కు  ఫ్యాషన్‌ ప్రపంచ మీద ఆసక్తి ఏర్పడింది తల్లి ద్వారానే. తల్లి ఒక వస్త్ర దుకాణంలో టైలర్‌గా పనిచేసేది.అలాగే   తనకు, తన తోబుట్టువులకు తల్లి రూపొందించిన దుస్తులు చూసి ప్రేరణ పొందింది. తల్లిలోని ఇ నైపుణ్యమే అనితను ఫ్యాషన్‌ డిజైనర్‌గా అద్భుతమైన కెరీర్‌కు పునాదులు వేసింది. అలా 19 ఏళ్ల వయసులో అనితాకు ప్యాషన్‌ డిజైనర్‌గా అవతరించింది. ఈ క్రమంలోనే  వర్కింగ్‌  విమెన్‌కు  అందుబాటు ధరలో  దుస్తులను అందించే భారతీయ రీటైల్‌ కంపెనీ లేదని గుర్తించారు. ఫ్యాషన్ డిజైనర్‌గా సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. దీనికి బంధువులు, స్నేహితులు నిరుత్సాహపర్చినా, తల్లి మాత్రం వెన్ను తట్టి ప్రోత్సహించింది. 

అనితా డోంగ్రే సొంత వ్యాపారం 
1995లో అనిత ,ఆమె సోదరి  కలిసి ఒక చిన్న ఫ్లాట్‌లో పాశ్చాత్య దుస్తులను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు.   ప్రారంభంలో  బ్లాండ్లనుంచి గానీ, మాల్స్‌నుంచి  దాకా వీరి ఉత్పత్తులకు  ఎలాంటి ప్రోత్సాహం లభించలేదు సరికదా  ఎద్దేవా చేశారు. కానీ ఆమె మాత్రం నిరాశ పడలేదు. మరింత పట్టుదల పెరిగింది.  తన స్వంత కంపెనీని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. AND డిజైన్స్ పేరుతో ప్రారంభించిన బిజినెస్‌ పెద్దగా సక్సెస్‌ లేదు. అయినా ఏ మాత్రం తగ్గలేదు.  2015లో ఈ కంపెనీ పేరును హౌస్ ఆఫ్ అనితా డోంగ్రేగా మార్చారు. ఇక అంతే అక్కడినుంచి వెనక్కి తిరిగి చూసింది లేదు.

తనదైన ప్రత్యేకమైన  శైలిలో రూపొందించిన అనిత ఫ్యాషన్‌ దుస్తులకు విపరీతమైన  ప్రజాదరణ లభించింది.  రిచెస్ట్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌గా ఘనతకు దక్కిచు కున్నారు.  ముఖ్యంగా  పాశ్చాత్య నాగరికతను భారతీయ సాంప్రయదాయం,కళలకు స్టయిల్   జోడించి హైబ్రిడ్ దుస్తులతో  తనదైన ఫ్యాషన్ సామ్రాజ్యాన్ని  రూపొందించింది. అలా ఒక చిన్న అపార్ట్‌మెంట్‌ బాల్కనీలో రెండు కుట్టు మిషన్లతో ప్రారంభమైం ఇప్పుడు దేశవ్యాప్తంగా 270 అవుట్‌లెట్‌లకు విస్తరించింది.  ప్రస్తుతం ఆమె భారతదేశంలోని అత్యంత సంపన్న ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరుగా నిలిచారు అనితా. కంపెనీ విలువ రూ.1400 కోట్లకు పైమాటే. 

సంపన్న వివాహాల నుండి అంతర్జాతీయ రెడ్ కార్పెట్‌లగాలాస్‌ దాకా ప్రతిచోటా మహిళలకోసం అద్భుతమైన సృష్టిని చూడవచ్చు. బ్రిటన్‌ యువరాణి కేట్ మిడిల్టన్, అంతర్జాతీయ పాప్ గాయని బియాన్స్ నోలెస్ , ప్రియాంక చోప్రా,  కత్రినా కైఫ్ లాంటి సెలబ్రిటీలు అనితా డోంగ్రే కస్టమర్లలో ఉన్నారంటే ఆయన క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. AND, గ్లోబల్ దేశీ, గ్రాస్‌రూట్, అనితా డోంగ్రే  బ్రాండ్స్‌తో ఆమె వ్యాపారం దూసుకుపోతోంది. వేడుక ఏదైనా సరే.. ఆమె ఫ్యాషన్‌ స్టయిల్‌ ఒక ఐకాన్‌గా నిలుస్తుంది. అంతేకాదు ఇటీవల ఆమె పర్యావరణ అనుకూలమైన లాండ్రీ జెల్‌ను లాంచ్‌ చేయడం గమనార్హం.

A post shared by Grassroot by Anita Dongre (@grassrootbyanitadongre)

మరిన్ని వార్తలు