వ్యర్థాల ద్వారా ఏటా 65 గిగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి!

22 Aug, 2023 04:08 IST|Sakshi

భారత వార్షిక సామర్థ్యంపై అంచనా  

న్యూఢిల్లీ: భారీ మొత్తంలో వెలువడుతున్న వ్యర్థాలను వినియోగించుకుని భారత్‌ వార్షికంగా 65 గిగావాట్ల (జీడబ్ల్యూ) విద్యుత్‌ ఉత్పత్తిని సాధించగలదని ఈ రంగంలో నిపుణులు అంచనావేస్తున్నారు. ఇది 2030 నాటికి 165 గిగావాట్లకు, 2050 నాటికి 436 గిగావాట్లకు పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా వారు విశ్లేషించారు. వేస్టేజ్‌ నిర్వహణపై ఇక్కడ రెండు రోజుల వర్క్‌షాపు జరిగింది.

వర్క్‌షాపులో వెల్లడైన అంశాల ప్రకారం, భారతదేశంలో ప్రతి సంవత్సరం 65 మిలియన్‌ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ పరిమాణం 2030 నాటికి 165 మిలియన్‌ టన్నులకు, 2050 నాటికి 436 మిలియన్‌ టన్నులకు పెరుగుతుంది. మునిసిపల్‌ చెత్తలో 75–80 శాతమే సమీకరణ జరుగుతోంది. ఇందులో 22 నుండి 28 శాతం మాత్రమే ప్రాసెస్‌ జరిగి,  శుద్ధి అవుతోంది. తగిన రీతిన వేస్ట్‌ నుంచి విద్యుత్‌ ఉత్పత్తి జరిగే వ్యవస్థ రూపొందితే.. పర్యావరణ పరిరక్షణలో ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.   

మరిన్ని వార్తలు