టోకు ధరలు కూల్‌.. కూల్‌!

17 Jan, 2023 09:13 IST|Sakshi

డిసెంబర్‌ ద్రవ్యోల్బణం 4.95 శాతమే..

22 నెలల కనిష్ట స్థాయి

ఫుడ్‌ ఆర్టికల్స్‌ ధరలు తగ్గుదల  

న్యూఢిల్లీ: దేశ ఎకానమీకి ధరల తగ్గుదల ఊరటనిస్తోంది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం అంకెల దిగువ బాటలోనే టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా నడిచాయి. డిసెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం కేవలం 4.95 శాతంగా (2021 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. గడచిన 22 నెలల కాలంలో (2021 ఫిబ్రవరిలో 4.83 శాతం) ఇంత తక్కువ స్థాయి గణాంకాల నమోదు ఇదే తొలిసారి.

ఫుడ్‌ ఆర్టికల్స్‌ ప్రత్యేకించి కూరగాయలు, ఆయిల్‌సీడ్స్‌ ధరలు తగ్గడం మొత్తం టోకు ద్రవ్యోల్బణం గణాంకల తగ్గుదలకు కారణం. 2022 సెప్టెంబర్‌ వరకు వరుసగా 18 నెలలు టోకు ద్రవ్యోల్బణం రెండంకెలపైన కొనసాగింది. అక్టోబర్‌ నుంచి గడచిన మూడు నెలల్లో రెండంకెల దిగువకు చేరింది.  డిసెంబర్‌లో ఫుడ్‌ బాస్కెట్‌ ధర తగ్గడం మొత్తం రిటైల్‌ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపిన సంగతి తెలిసిందే.   నవంబర్‌లో 5.88 శాతంగా నమోదుకాగా, డిసెంబర్‌లో మరింత తగ్గి 5.72%కి (2021 డిసెంబర్‌తో పోల్చి)  చేరడం ఎకానమీకి ఊరటనిచ్చింది.

చదవండి: సేల్స్‌ రచ్చ మామూలుగా లేదు, ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాల్లో నంబర్‌ వన్‌!

మరిన్ని వార్తలు