డిసెంబరే టార్గెట్‌.. ఎయిరిండియాను అమ్మేయడానికే

24 Aug, 2021 14:18 IST|Sakshi

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి అమ్మేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (డీఐపీఎఎమ్)  ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ఎయిరిండియా  నష్టాలు 2020 మార్చి 31 నాటికి రూ. 70,820 కోట్లకు చేరినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ అప్పుల ఊబిలో నుంచి బయటపడేందుకు వ్యూహాత్మక పెట్టుబడుల కోసం బిడ్డింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు డీఐపీఎఎమ్ ప్రతినిధులు వెల్లడించారు.

ఇక ఎయిర్ ఇండియాకు వ్యతిరేకంగా న్యూయార్క్‌ కోర్ట్‌లో కొనసాగుతున్న విచారణ పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, అవసరమైతే  బిడ్డర్లకు ప్రభుత్వం హామీ ఇస్తుందని బిజినెస్‌ టైమ్స్‌తో డీఐపీఎఎమ్‌ ప్రతినిధులు చెప్పినట్లు కొన్ని కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా,ఈ బిడ్డింగ్‌ ప్రక్రియ పూర్తయితే ఈ ఏడాదిలోనే  అమ్మేయడం ఖరారైనట్లేనని ఆర్ధిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు