ఐటీ రంగం నెత్తిన మరో పిడుగు: టెకీల గుండెల్లో గుబులు

6 Oct, 2023 12:36 IST|Sakshi

జేపీ మోర్గాన్‌ విశ్లేషకుల కీలక అంచనాలు

సంక్షోభంలో ఉన్న భారతీయ ఐటీ రంగానికి  చెందిన తాజా నివేదిక ఒకటి సంచలనం  రేపుతోంది.  2024 ఆర్థిక సంవత్సరం కూడా అతలాకుతలమేనని ప్రఖ్యాత ఫైనాన్స్ సంస్థ జేపీ మోర్గాన్‌ విశ్లేషకులు  బాంబు పేల్చారు. అయితే  2025 ఆర్థిక సంవత్సరంలో  ప్రాజెక్ట్స్‌ డీల్స్‌  మెరుగుపడే అవకాశం ఉందని భావించారు.  

ఇటీవలి తమ పరిశీలనలో భారత ఐటీ రంగంలో చెప్పుకోదగిన పురోగతి కనిపించలేదంటూ నిరాశను ప్రకటించారు. దీంతో ఐటీపై తమ నెగటివ్‌ ధోరణిని కొనసాగిస్తామని జేపీ మోర్గాన్‌ విశ్లేషకులు అంకుర్ రుద్ర, భావిక్ మెహతా   తాజా నోట్‌లో తెలిపారు. మరోవైపు సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల్లో ఐటీ కంపెనీల ఆదాయాలు నిరుత్సాహకరంగా ఉండ బోతున్నాయన్న అంచనాలున్నాయి. ఈ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, గైడెన్స్‌ను పెట్టుబడిదారులు నిశితంగా పరిశీలిస్తారని జేపీ మోర్గాన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2024 ని  "వాష్‌అవుట్"గా  ఇన్వెస్టర్లు  పేర్కొంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ 2025 వ్యూహంపై దృష్టి పెట్టాలని వారు భావిస్తారన్నారు.  (స్పెషల్‌ఫీచర్‌తో డైసన్‌ హెడ్‌ఫోన్స్‌ వచ్చేశాయ్‌..యాపిల్‌కు కష్టమే!)

వివిధ పరిశ్రమల ఎగ్జిక్యూటివ్‌లతో జరిగిన సమావేశంలో ఎలాంటి ఆశావమదృక్పథం  కనపించలేదన్నారు డిమాండ్‌ ఇంకా పుంజుకోనందున్న ఐటీ పరిశ్రమపై తమ దృక్పథం బేరిష్‌గా ఉంది. మొత్తం పరిస్థితి మునుపటి త్రైమాసికంతో పోలిస్తే పరిస్థితి మెరుగ్గాలేదని వెల్లడించారు. అలాగే  దీర్ఘకాలం అధిక వడ్డీరేట్లు కొనసాగితే ఆర్థిక వృద్ధి మందమనం భయాలతొ పరిస్థితి ప్రతికూలమని ఇన్ఫోసిస్, టిసిఎస్, విప్రో ,హెచ్‌సిఎల్‌టెక్‌తో సహా అన్ని ప్రధాన ఐటి సంస్థలు గతంలోనే హెచ్చరించాయి, ఎక్కువ యుఎస్ బేస్డ్‌ క్లయింట్లు కావడంతో తమ ఐటి వ్యయాన్ని తగ్గించడం, కాంట్రాక్టులను కూడా రద్దు లేదా ఆలస్య మవుతున్నాయని తెలిపాయి. ( క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఆదాయంపై బీవోబీ సంచలన అంచనాలు)

ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టర్లు FY24 ఒక వాష్‌అవుట్ అని భావించారనీ, రీబౌండ్ ఆశలతో FY25కి దృష్టి మరల్చారని విశ్లేషకులు చెప్పారు. అలాగే  గత మూడు నెలల్లో బ్లూ-చిప్ నిఫ్టీ 50, నిఫ్టీ IT ఇండెక్స్‌ను అధిగమించిందనికూడా వివరించారు. వచ్చే వారం టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ తమ ఫలితాలను ప్రకటనుంచ నున్నారు. ఈసమయంలో జేపీ మోర్గన్ నివేదిక కీలకంగా మారింది. అంతేకాదు త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని  ఎదురుచూస్తున్న టెకీలకు నిరాశే ఎదురైంది.  (గ్లాస్‌ సీలింగ్‌ బ్రేక్స్‌:ఈ మెకానికల్‌ ఇంజనీర్ గురించి తెలిస్తే ఫిదా)

కాగా ఇప్పటికే భారత్‌ సహా, దిగ్గజ ఐటీ సంస్థలకు ప్రాజెక్టులు తగ్గిపోయాయి. ఆదాయాలు క్షీణించాయి. ఫలితంగా ఉద్యోగ నియామకాలు గణనీయంగా పడి పోయాయి. ప్రాజెక్టులు లేక బెంచ్‌ మీద ఉద్యోగులను  చాలామందిని ఇంటికి పంపించేశాయి. ఆన్‌బోర్డింగ్  జాప్యంతోపాటు,  క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లపై దెబ్బ పడింది. ఐటీ, టెక్‌  కంపెనీల్లో  వేలాదిమంది ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు.   (ICC పురుషుల ప్రపంచ కప్ 2023: ఫ్యాన్స్‌కు ఎయిర్‌టెల్‌ గుడ్‌ న్యూస్‌)

మరిన్ని వార్తలు