Year End RoundUp 2023: స్టార్టప్‌లూ వదిలిపెట్టలేదు! ఈ ఏడాది ఎంతమందిని తొలగించాయంటే..

24 Dec, 2023 20:52 IST|Sakshi

2023 ఏ రంగాలకు ఎలా ఉన్నా.. టెక్ కంపెనీలకు, స్టార్టప్‌లకు మాత్రం కొంత నష్టమే వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఈ కథనంలో భారతదేశంలో ఎన్ని స్టార్టప్‌ కంపెనీలు ఎంతమంది ఉద్యోగులను తొలగించాయి, ఎందుకు తొలగించాయనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

Layoffs.fyi డేటా ప్రకారం.. 2023లో సుమారు 100 ఇండియన్ స్టార్టప్‌ కంపెనీలు 15000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. ఆర్థిక పరిస్థితుల కారణంగా బైజు సంస్థ రెండు విడతల్లో 2,500 మంది ఉద్యోగులను తొలగించింది. ఇటీవల ఉద్యోగుల వేతనాలు చెల్లించేందుకు బైజూ వ్యవస్థాపకుడు రవీంద్రన్ తన ఆస్తులను తాకట్టుపెట్టడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఈ ఏడాది 100 మందికి పైగా ఉద్యోగులకు పింక్ స్లిప్‌లను అందజేసిన స్టార్టప్‌ కంపెనీలలో ఓలా (200), కెప్టెన్ ఫ్రెష్ (120), షేర్‌చాట్ (500), స్విగ్గీ (380), మెడిబడ్డీ (200), డీల్‌షేర్ (100), మైగేట్ (200), బహుభుజి (100), SAP ల్యాబ్స్ (300), అప్‌గ్రాడ్ (120), ప్రిస్టిన్ కేర్ (300), 1k కిరానా (600), Dunzo (300), జెస్ట్ మనీ (100), సింప్ల్ (150), స్కిల్ లింక్ (400), ఎక్స్‌ట్రామార్క్‌లు (300), వాహ్ వాహ్! (150), మీషో (251), క్యూమత్ (100), హప్పే (160), గ్లామియో హెల్త్ (160), మోజోకేర్ (170), వేకూల్ (300), నవీ టెక్నాలజీస్ (200), మిల్క్‌బాస్కెట్ (400), టెకియోన్ (300), స్పిన్నీ (300), MPL (350) మొదలైనవి ఉన్నాయి.

ఇదీ చదవండి: రూ. 700లకే మహీంద్రా థార్! ఆనంద్ మహీంద్రా రిప్లై ఇలా..

ప్రపంచవ్యాప్తంగా 1160 కంటే ఎక్కువ టెక్ కంపెనీలు ఈ ఏడాది ఏకంగా 26,02,238 మంది ఉద్యోగులను తొలగించాయి. 2022లో 1064 కంపెనీలు 1,64,969 మంది సిబ్బందిని తొలగించాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా, మార్కెటింగ్ ఖర్చులను తగ్గించుకోవడం, వ్యయ నిర్మాణాలను సరిచేయడం వంటి వాటిలో భాగంగా ఉద్యోగులను తొలగించాల్సి వచ్చినట్లు కంపెనీలు స్పష్టం చేశాయి.

>
మరిన్ని వార్తలు