AI అంటే భారతీయులకు భయమే.. జాబ్‌ ఎక్కడ పోతుందేమోనని!

30 Oct, 2023 17:14 IST|Sakshi

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ai) కారణంగా ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే ‘తాము జాబు కోల్పోతామనే’ ఆందోళన భారతీయుల్లో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకి భారత్‌లో ఏఐతో ఏయే రంగాల ఉద్యోగులు ప్రభావితం కానున్నారు?

ప్రముఖ స్టాఫింగ్‌ సంస్థ రాండ్‌స్టాడ్‌ పలు దేశాల్లో వార్షిక సర్వే నిర్వహించింది. ఆ సర్వేల్లో అమెరికా, యూకే, జర్మనీ వంటి దేశాలతో పోలిస్తే.. ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు ఏఐ కారణంగా ఉద్యోగం పోతుందేమోనన్న భయం వ్యక్తం చేసినట్లు తెలిపింది. 

ముఖ్యంగా, మనుషుల స్థానంలో ఏఐ ఆటోమెషిన్‌ను వినియోగించే రంగాలైన బిజినెస్‌ ప్రాసెసింగ్‌ అవుట్‌ సోర్సింగ్‌ (బీపీవో), నాలెడ్జ్‌ ప్రాసెస్‌ అవుట్‌ సోర్సింగ్‌ (కేపీవో) సెక్టార్‌లలో పనిచేసే సిబ్బంది ఎక్కువమంది ఉన్నట్లు రాండ్‌స్టాడ్‌ నివేదిక హైలెట్‌ చేసింది.   

ప్రతి 10 మందిలో ఏడుగురు
రాండ్‌ స్టాడ్‌ వర్క్ మానిటర్ క్యూ3 2023 ఎడిషన్‌లో ఉద్యోగుల స్కిల్స్‌ డిమాండ్స్‌, కృత్రిమ మేధ ప్రభావంపై 1606 మందితో సర్వే నిర్వహించింది. ఇందులో  55శాతం మంది పురుషులు ,45శాతం మంది మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. వీరిలో ప్రతి పది మందిలో ఏడుగురు కృత్రిమ మేధ తాము చేస్తున్న రంగాలపై ప్రభావం చూపుతుందని నమ్ముతున్నారని వెల్లడైంది. అదేవిధంగా, వచ్చే ఐదేళ్లలో టెక్నాలజీ సంబంధిత నైపుణ్యాల ప్రాముఖ్యతను సమానంగా ప్రతిస్పందించారు. రాండ్‌స్టాడ్‌ సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది తమ ఉద్యోగాల్లో ఏఐని ఉపయోగిస్తున్నారని, గత ఏడాది కాలంలో కేవలం 6 శాతం మంది మాత్రమే ఏఐపై శిక్షణ పొందలేదని వెల్లడించారు.    

ఉద్యోగాలకు రాజీనామా చేస్తాం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత ఆ స్థాయిలో ఐటి, సాంకేతికతను ఉపయోగించడం, నిర్వహించడం, అర్థం చేసుకోవడం, అంచనా వేయడంపై 28 శాతం, నిర్వహణ, నాయకత్వ నైపుణ్యలాపై 27శాతం మంది తమ స్కిల్స్‌ను పెంచుకోవాలని భావిస్తున్నట్లు అధ్యయనం గుర్తించింది. మిగిలిన ఉద్యోగులు వచ్చే 12నెలల్లోగా తమ యజమానులు కెరియర్‌లో సంతృప్తినిచ్చేలా అవకాశాలు కల్పించకపోతే తమ ఉద్యోగాలకు రాజీనామానా చేసే అంశాల్ని పరిశీలిస్తామని సగం మంది అభిప్రాయ పడ్డారు. 

స్కిల్స్‌ ఉంటే 
ఈ సందర్భంగా రాండ్‌స్టాడ్‌ ఇండియా సీఈవో విశ్వనాథ్‌ మాట్లాడుతూ.. కేపీవో, బీపీవో విభాగాల్లో భారతీయులు ఎక్కువ మంది పనిచేస్తున్నారు. ఆ రంగాల్ని ఏఐ భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.పైగా, కృత్తిమ మేధను వినియోగించే దేశాల్లో భారత్‌ వేగంగా ఉంది. కాబట్టి పైన పేర్కొన్న రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఏఐపై దృష్టిసారించాలని సూచించారు.

మరిన్ని వార్తలు