ఇక ఒలెక్ట్రా ఈ–టిప్పర్స్‌..

2 Mar, 2023 01:35 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మేఘా ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ భారత్‌లో తొలిసారిగా తయారు చేసిన 6్ఠ4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్‌ టిప్పర్స్‌కు హోమోలోగేషన్‌ ధ్రువీకరణ లభించింది. ఆటోమోటివ్‌ రీసర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా నుంచి ఈ సర్టిఫికెట్‌ సాధించింది.  రహదారులకు టిప్పర్‌ అనువైనదో లేదో తెలుసుకునేందుకు పర్వత ప్రాంతాలు, ఎత్తయిన ప్రదేశాలు, మైనింగ్, క్వారీల్లో పరీక్షలు చేసి ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు.

  దేశంలోనే మొట్టమొదటి సర్టిఫైడ్‌ హెవీ డ్యూటీ ఈ–టిప్పర్‌గా ఇది నిలిచిందని ఒలెక్ట్రా సీఎండీ కె.వి.ప్రదీప్‌ తెలిపారు.  20 ఈ–టిప్పర్ల సరఫరాకై ఒక సంస్థతో చర్చలు తుది దశలో ఉన్నాయని చెప్పారు. వివిధ వేరియంట్లలో ఈ వాహనాన్ని విడుదల చేస్తామన్నారు. నిర్మాణం, మౌలిక సదుపాయాలు, మైనింగ్, క్వారీ రంగాల్లో ఇది గణనీయమైన మార్పును తేనుందని వివరించారు.

మరిన్ని వార్తలు