తప్పులో కాలేసిన పారిశ్రామికవేత్త హర్ష్‌ గోయెంకా

22 Sep, 2021 17:24 IST|Sakshi

Fact Check: సోషల్‌ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త హార్ష్‌ గోయేంకా తప్పులో కాలేశారు. సరైన సమచారం లేకుండా వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన ఓ ఫోటోను షేర్‌ చేశారు. ఇంతలో ఆ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో బెంగాల్‌ ప్రభుత్వం నిజాలు వెల్లడించింది.


షెర్లాక్‌ హోమ్స్‌
కూలి పోవడానికి సిద్ధంగా ఉన్న ఓ పాడుబడ్డ భవనం. ఆ బిల్డింగ్‌ ద్వారాలకు డిటెక్టివ్‌ డిపార్ట్‌మెంట్‌ , సీఐడీ వెస్ట్‌బెంగాల్‌ అన్న బోర్డు. దాని కింద నుంచి నడుముకు టవల్‌ చుట్టుకుని చేతిలో బకెట్‌తో నడుచుకుంటూ వస్తున్న వ్యక్తి. పైన బోర్డుకు కింద కనిపిస్తున్న మనిషికి మధ్య పొంతనే లేదు. ఈ ఫోటోను ఆర్‌పీజీ గ్రూప్‌ చైర్మన్‌ హార్ష్‌గోయెంక ట్వీట్‌ చేశారు. ‘షెర్లాక్‌హోమ్స్‌ స్టెపింగ్‌ అవుట్‌ ఆఫ్‌ హిజ్‌ బేకర్‌ స్ట్రీట్‌ ఆఫీస్‌ ఇన్‌ కోల్‌కతా’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు.


మారువేశంలో
హర్ష్‌ గోయేంకా చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. డిటెక్టివ్ మారు వేశంలో ఉన్నాడంటూ చాలా మంది వ్యంగంగా స్పందించగా మరికొందరు డిటెక్టివ్‌లు ఆఫీసుల కూర్చుని ఉండిపోకుండా ఫీల్డ్‌కు వెళ్లాలని ఇలా చేశారంటూ చమత్కరించారు. కానీ చాలా మంది రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం మమతా బెనర్జీని టార్గెట్‌గా చేసుకుని కామెంట్లు చేశారు. 
వాస్తవం ఇది
బ్రిటిష్‌ కాలంలోనే 1886లోనే కోల్‌కతాలో ఓ బ్రిటీష్‌ అధికారి హత్యకు గురైతే తొలిసారిగా డిటెక్టివ్‌ కార్యాలయం నెలకొల్పారు. వందల ఏళ్ల నుంచి ఈ నగరంలో డిటెక్టివ్‌ డిపార్ట్‌మెంట్‌ పని చేస్తోంది. నగరంలోని పీల్ఖానాలో డిటెక్టివ్‌ భవనం కూలేందుకు సిద్ధంగా ఉండటంతో 2016లో ఆ భవనం ఖాళీ చేశారు. భవనీ నగర్‌లోని సీఐడీ కార్యాలయంలోకి డిటెక్టివ్‌ ఆఫీస్‌ని మార్చారు. అయితే పాత ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 
ఎవరీ షెర్లాక్‌హోమ్స్‌
ఇంగ్లండ్‌ రచయిత విలియం షేక్స్‌పియిర్‌ గొప్ప రచనలు ఎన్నో చేశారు. అందులో డిటెక్టివ్‌ ప్రధాన పాత్రగా షెర్లాక్‌ హోమ్స్‌ అనే నాటకం రచించారు. దీంతో సీక్రెట్‌ ఏజెంట్‌ అంటే జేమ్స్‌బాండ్‌ పాత్ర గుర్తొచ్చినట్టు  ప్రపంచ వ్యాప్తంగా డిటెక్టివ్‌ అంటే షెర్లాక్‌హోమ్స్‌ గుర్తుకురావడం పరిపాటిగా మారింది.

చదవండి : కానిస్టేబుల్‌ ధైర్యానికి ఆనంద్‌ మహీంద్రా ఫిదా !

మరిన్ని వార్తలు