కంపెనీలు ఎదుర్కొంటున్న రిస్క్‌లేంటో తెలుసా? ఫిక్కీ సర్వేలో కీలక విషయాలు!

21 Apr, 2023 08:02 IST|Sakshi

ఐపీ చోరీ, సైబర్‌ దాడుల ముప్పు

తర్వాత ప్రమాదాల రూపంలో రిస్క్‌

ఎక్కువ కంపెనీలకు ఇవే సమస్యలు

పెరిగిన మహిళల భద్రతా ముప్పు

ఫిక్కీ సర్వేలో వెల్లడైన అంశాలు

న్యూఢిల్లీ: మేధోపరమైన హక్కులు (ఐపీ), సమాచారం, సైబర్‌ దాడులు, ప్రమాదాలు అనేవి భారత కంపెనీలు ఎదుర్కొంటున్న ప్రధాన రిస్క్‌లు అని ఫిక్కీ సర్వే తెలిపింది. మహిళల భద్రతా ముప్పు 2021లో 12వ స్థానంలో ఉంటే, 2022లో 5వ స్థానానికి వచ్చినట్టు పేర్కొంది. దీంతో కంపెనీలు తమ మహిళా ఉద్యోగుల భద్రతకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ సర్వే ఎత్తి చూపింది.   

ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్‌!

  • లాజిస్టిక్స్, నిర్మాణ రంగ కంపెనీలు ప్రమాదాలు, ఐపీ హక్కుల చోరీని ప్రధానంగా ప్రస్తావించాయి.  
  • ముఖ్యంగా లాజిస్టిక్స్‌ కంపెనీలకు రోడ్డు ప్రమాదాలు రెండో అత్యంత ఆందోళకరమైన అంశంగా ఉంది. ఐపీ హక్కుల చోరీ మొదటి స్థానంలో ఉంది.  
  • నిర్మాణ రంగ కంపెనీలు ప్రమాదాల రూపంలో ఎక్కువ రిస్క్‌ను చూస్తున్నాయి. 
  • రిటైల్‌ పరిశ్రమ ప్రమాదాలు, ఐపీ హక్కుల చోరీ, విపత్తులను రిస్క్‌లుగా తెలిపాయి.  
  • మీడియా, వినోద పరిశ్రమ సమాచారం, సైబర్‌ సెక్యూరిటీ రిస్క్‌లను ప్రస్తావించాయి.  
  • ఐటీ, తయారీ రంగంలో ఐపీ హక్కుల చోరీ ప్రథమ రిస్క్‌గా ఉంది. 
  • మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఎదురయ్యే రిస్క్‌లను తెలుసుకునేందుకు ఫిక్కీ ఈ వార్షిక సర్వే నిర్వహించింది.

ఇదీ చదవండి: వాహన ఇన్సూరెన్స్‌ చేయిస్తున్నారా? వీటితో భలే బెనిఫిట్స్‌! 

మరిన్ని వార్తలు