మ్యూజిక్‌ లవర్స్‌కి అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. రూ. 8 వేలకే యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌!

15 Jan, 2023 13:28 IST|Sakshi

యాపిల్‌ కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ ఉత్పత్తులుకు డిమాండ్‌ మామూలుగా ఉండదన్న సంగతి తెలిసిందే. ఐఫోన్‌, ఎయిర్‌పాడ్స్‌, ఐప్యాడ్‌ ఇలా ఏదైనా టూ కాస్ట్లీగా ఉంటాయి. అయినా కూడా ఇవి సేల్స్‌ పరంగా దుమ్ము దులుపుతుంటాయి. అందుకు ఈ బ్రాండ్‌పై ఉన్న నమ్మకం, ఇందులో ఉపయోగిస్తున్న టెక్నాలజీ కారణమనే చెప్పాలి.

అయితే యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ ధరలు కూడా భారీ స్థాయిలో ధరలు ఉండడంతో, మిగిలిన ఉత్పత్తులతో పాలిస్తే ఇవి వినియోగదారులను అంతగా ఆకట్టుకోకపోతున్నామని యాపిల్‌ భావిస్తోంది. అందుకే తక్కువ ధరలో ఎయిర్‌పాడ్స్‌ను తీసుకురావాలని యోచిస్తోంది.

ఆడియో మార్కెట్‌పై కన్ను... రూ.8 వేలకే
సమాచారం ప్రకారం.. యాపిల్‌ సరసమైన ధరలలో ఎయిర్‌పాడ్స్‌ తీసుకురావడం మాత్రమే కాకుండా, కొత్త తరం ఎయిర్‌పాడ్స్‌ మాక్స్‌( AirPods Max)పై కూడా పనిచేస్తోంది.సరసమైన ఎయిర్‌పాడ్స్‌ ధర 99 డాలర్లు(ఇది భారతదేశంలో కరెన్సీ ప్రకారం దాదాపు రూ.8000) ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  అంతేకాకుండా ఎయిర్‌పాడ్స్‌ సరఫరాదారులను కూడా మార్చాలని కంపెనీ చూస్తున్నట్లు సమాచారం.

ఒక వేళ ఈ ధరలో యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ అందుబాటులోకి వస్తే సేల్స్‌ అమాంతం పెరిగే అవకాశం ఉంది. అయితే, బడ్జెట్‌లో వచ్చే ఎయిర్‌పాడ్స్‌లో యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఉండకపోవచ్చని అనలిస్టులు చెబుతున్నారు. ఎయిర్‌పాడ్స్‌ను తక్కువ ధరలో తీసుకురావడం ద్వారా ఆడియో మార్కెట్‌లోనూ తమ సేల్స్‌పెంచుకోవాలన్నది యాపిల్‌ లక్ష్యంగా తెలుస్తోంది. ఒకవేళ రూ.8వేల ధరలో తీసుకొస్తే యాపిల్‌ సేల్స్‌ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ (Airpods) కొనాలంటే కనీసం రూ.15వేలు వెచ్చించాల్సిందే. 

చదవండి: అమెజాన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. తక్కువ ధరకే కొత్త ప్లాన్‌, ప్రైమ్‌ కంటే చవక!

మరిన్ని వార్తలు