ఆర్‌ఆర్‌ కేబుల్‌ ఐపీవో బాట

5 Dec, 2022 07:51 IST|Sakshi

మే నెలలో సెబీకి దరఖాస్తు 

న్యూఢిల్లీ: వైర్లు, కేబుళ్లుసహా ఎఫ్‌ఎంఈజీ ప్రొడక్టుల తయారీ కంపెనీ ఆర్‌ఆర్‌ కేబుల్‌ పబ్లిక్‌ ఇష్యూ ప్రణాళికల్లో ఉంది. ఇందుకు అనుగుణంగా వచ్చే మే నెలలో క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక దరఖాస్తును దాఖలు చేసే అవకాశముంది. ఆర్‌ఆర్‌ గ్లోబల్‌ గ్రూప్‌ కంపెనీ రానున్న మూడేళ్లపాటు ప్రతీయేటా టర్నోవర్‌ను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

వెరసి 2026కల్లా రూ. 11,000 కోట్ల అమ్మకాలు అందుకోవాలని చూస్తున్నట్లు కంపెనీ ఎండీ, గ్రూప్‌ ప్రెసిడెంట్‌ శ్రీగోపాల్‌ కాబ్రా తెలియజేశారు. 2023–24 మూడో త్రైమాసికంలో ఐపీవో చేపట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. 

చదవండి అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.7వేలకే అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌టీవీ!

మరిన్ని వార్తలు