కేంద్రం సంచలన నిర్ణయం.. గ్యాస్ సిలిండర్లపై కొత్త రూల్స్‌!

2 Oct, 2022 11:07 IST|Sakshi

ఇటీవలే నిత్యవసరాల వస్తువులకు జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి సామాన్యుడికి కేంద్రం ప్రభుత్వం షాకిచ్చింది.  తాజాగా గ్యాస్‌ సిలిండర్లపై కొత్త నిబంధనలను తీసుకొచ్చి మరో ఊహించని షాక్‌ ఇవ్వనుంది. పలు మీడియా నివేదికల ప్రకారం.. గ్యాస్ వినియోగంపై పరిమితులు విధిస్తూ మోదీ సర్కార్‌ కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టనుంది. దీని ప్రకారం... వినియోగదారులు ఇకపై ఏడాదికి 15 సిలిండర్లు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. నెలకు కేవలం 2 గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేసేలా.. మార్పులు చేసింది. అయితే ఇప్పటి వరకూ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా..ప్రచారం మాత్రం సాగుతోంది.

ఇదిలా ఉంటే.. దేశంలో నాన్-సబ్సిడీ కనెక్షన్ వినియోగదారులు ఇప్పటివరకు ఎన్ని సిలిండర్లు కావాలన్నా రీఫిల్స్ బుక్ చేసుకోవచ్చు. అయితే కొందరు వినియోగదారులు సిలిండర్లను దుర్వినియోగం చేస్తున్నారని నివేదికలు బయటపడ్డాయి. దీంతో ఈ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.


కొత్తగా తీసుకురాబోయే చట్టం ప్రకారం.. ఒకవేళ అదనంగా సిలిండర్ల అవసరమైతే..  వినియోగదారులు సిలిండర్‌ తీసుకోవాల్సిన అవసరాన్ని తెలపడంతో పాటు నిర్ధేశించిన డ్యాకుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. వీటి డిమాండ్‌ని పరిశీలిస్తే.. జూలై 1, 2021, జూలై 6, 2022 మధ్య 12 నెలల కాలంలో వంట గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. జూలై 2021లో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 834 ఉండగా, జూలై 2022 నాటికి , 26 శాతం పెరిగి రూ.1,053కి చేరుకుంది.


ఎల్‌పీజీ( LPG)) సిలిండర్ ధరలు ప్రతి రాష్ట్రంలో వేరువేరుగా ఉంటాయి. ఎందుకంటే వాటి విలువ ఆ రాష్ట్రంలో విధించే పన్నులతో పాటు రవాణా ఛార్జీలపై ఆధారపడి ఉంటాయి. వాటిని కూడా ముడి చమురు ధరల ఆధారంగా లెక్కిస్తారు.

చదవండి: బ్యాంకింగ్‌ బాదుడు.. రెడీగా ఉండండి, ఈ భారం కస్టమర్లదే!

మరిన్ని వార్తలు