ఎలక్ట్రిక్ కార్గో వాహనాలను లాంచ్ చేసిన మెజెంటా!

3 Dec, 2021 16:31 IST|Sakshi

ప్రముఖ భారతీయ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్(CPO) కంపెనీ అయిన మెజెంటా(Magenta), ఒమేగా సైకి (Omega Seiki) మొబిలిటీ భాగస్వామ్యంతో బెంగళూరులో తన ఎలక్ట్రిక్ వెహికల్ ఎనేబుల్డ్ ట్రాన్స్‌పోర్ట్ బ్రాండ్ క్రింద 100 ఎలక్ట్రిక్ కార్గో వాహనాలను లాంచ్ చేసినట్లు ప్రకటించింది. తమ "ఛార్జ్‌గ్రిడ్" బ్రాండ్ క్రింద ప్రత్యేకమైన ఈవీ ఛార్జింగ్ సొల్యూషన్‌లను అభివృద్ధి చేస్తున్న మెజెంటా ఈ సంవత్సరం ప్రారంభంలో " ఎలక్ట్రిక్ వెహికల్ ఎనేబుల్డ్ ట్రాన్స్‌పోర్ట్(EVET)" బ్రాండ్ క్రింద తమ ఈ-మొబిలిటీ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది. మెజెంటా ఇప్పటికే ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్లాట్‌ఫారమ్‌ని ఉపయోగించి 110 ఎలక్ట్రిక్ కార్గో రవాణా సేవలను నిర్వహిస్తోంది.

మెజెంటా ఈవీఈటీ అధికారికంగా ఫ్లీట్ యాజ్ ఎ సర్వీస్ అందించనున్నట్లు తెలిపింది. గత నెలలో 150 కంటే ఎక్కువ ఛార్జింగ్ పాయింట్లను మెజెంటా బెంగళూరులో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎలక్ట్రిక్ మొబిలిటీలో లాజిస్టికల్ అడ్డంకులను తగ్గించాలని, లాస్ట్ మైల్ డిస్ట్రిబ్యూషన్ సేవలకు సమగ్ర పరిష్కారాలను అందించాలని మెజెంటా భావిస్తోంది. ఇంటిగ్రేటెడ్ ఫ్లీట్‌ను ఒక సేవగా అందించడం, వాణిజ్య వాహనాల ఆపరేటర్‌ల కోసం మెజెంటా స్మార్ట్ ఛార్జింగ్ సేవలను, ఓవర్‌నైట్ పార్కింగ్ సేవలను కూడా అందిస్తుంది. ఈ సేవల వల్ల ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరిగే అవకాశం ఉన్నట్లు సంస్థ తెలిపింది.

(చదవండి: చరిత్రలో మరో అతిపెద్ద హ్యాకింగ్‌.. వందల కోట్లు హాంఫట్‌!)

మరిన్ని వార్తలు