తనను చెంప దెబ్బలు కొట్టడానికి మహిళను పనిలో పెట్టుకున్న ఓనర్!

11 Nov, 2021 15:08 IST|Sakshi

భారతీయ-అమెరికన్ మనేష్ సేథి తనని చెంపదెబ్బ కొట్టడానికి ఒక మహిళను నియమించుకున్న కథనం ఇప్పుడు మళ్లీ ఇంటర్‌నెట్‌లో ట్రెండ్ అవుతుంది. ఈ పోస్టుకు ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలలో ఒకరైన బిలియనీర్ ఎలోన్ మస్క్ స్పందిస్తూ రెండు ఫైర్ ఏమోజీలను పోస్టు చేశారు. అసలు విషయానికి వస్తే.. వేరబుల్ డివైసెస్ బ్రాండ్ పావ్ లోక్ వ్యవస్థాపకుడు మనేష్ సేథి. తను పనివేళల్లో ఎక్కువ శాతం ఫేస్‌బుక్ వినియోగిస్తుండేవాడు. దీనివల్ల అతని కంపెనీ మీద ఎక్కువ ప్రభావం పడింది.

ఈ సమస్యను ఎలాగైనా అధిగమించడం కోసం ఒక ఆలోచన చేశాడు. తాను పనిచేస్తున్న వేళలో ఫేస్‌బుక్ వినియోగించిన ప్రతిసారీ అతని ముఖంపై చెంపదెబ్బ కొట్టడానికి ఒక మహిళను నియమించుకున్నాడు. దీనికోసం యుఎస్ క్లాసిఫైడ్ అడ్వర్టైజ్ మెంట్స్ వెబ్ సైట్ క్రెయిగ్స్లిస్ట్ లో ఒక ప్రకటన ఇచ్చాడు. "నేను పనివేళల్లో సమయాన్ని వృధాచేసినప్పుడు మీరు నాపై అరవాలి లేదా అవసరమైతే నన్ను చెంపదెబ్బ కొట్టండి" అని అతను 2012లో ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ ఉద్యోగం కోసం ఎంపికైన వారికి గంటకు $8 డాలర్లు ఇస్తాను అన్నాడు. కారా అనే మహిళా ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యింది. స్లాపర్ కారాను నియమించిన తర్వాత మంచి ఫలితాలను వచ్చినట్లు మనేష్ సేథి తెలిపాడు. 

"సాదారణంగా నా సగటు ఉత్పాదకత 35-40% ఉండేది. కానీ, స్లాపర్ కారా నా పక్కన కూర్చున్నప్పుడు నా ఉత్పాదకత 98%కి పెరిగింది" అని అతను ఒక బ్లాగులో రాశాడు. ఈ స్టోరీ ఇప్పుడది కాదు. ఈ సంఘటన 2012లో జరిగింది. మళ్లీ ఈ పోస్టు ఇటీవల ఇంటర్‌నెట్‌లో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. ట్రెండ్ అవుతున్న పోస్టుపై టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ స్పందిస్తూ రెండు ఫైర్ ఏమోజీలను పోస్టు చేశారు. దీంతో మరింత ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. మీరు కూడా ఈ వీడియోను ఒకసారి చూడండి.

మరిన్ని వార్తలు