ఆన్‌లైన్‌ షాపింగ్‌: లడ్డూ కావాలా నాయనా..కస్టమర్‌కి దిమ్మతిరిగిందంతే!

23 Feb, 2023 14:53 IST|Sakshi

సాక్షి,ముంబై: ఆన్‌లైన్‌  షాకింగ్‌కు సంబంధించిన మరో విచిత్రమైన  ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆర్డర్ చేసిన వస్తువులకు బదులుగా వేర్వేరు వస్తువులను రావడం, ఖరీదైన వస్తువులకు బదులుగా చీప్‌ వస్తువులు, ఒక్కోసారి రాళ్లు, రప్పలు లాంటివి ఆన్‌లైన్ షాపింగ్‌లో తరచూ జరిగే చోద్యాలే. తాజాగా అమెజాన్‌లో తన కిష్టమైన బుక్‌ ఆర్డర్‌ చేసిన కస్టమర్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఈ విషయాన్ని యూజర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 

అమెజాన్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ఒక పుస్తకాన్ని ఆర్డర్ చేస్తే 'లుకింగ్ ఫర్ లడ్డూ' అనేక పిల్లల పుస్తకాన్ని డెలివరీ చేశారంటూ తన అనుభవాన్ని ట్వీట్‌ చేశాడు. అంతేకాదు నెగిటివ్ రివ్యూ, నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వొద్దని కూడా మొరపెట్టుకోవడం మరింత విడ్డూరంగా నిలిచింది. ఏమి జరుగుతోంది భయ్యా అంటూ @kashflyy అనే యూజర్‌ ఆవేదన వెలిబుచ్చారు.  (వోల్వో అభిమానులకు షాకిచ్చిందిగా!)

బాధితుడికి అందిన ఆ నోట్‌లో ఇలా ఉంది.  ''ప్రియమైన కస్టమర్, క్షమాపణలు సార్, మీరు ఈ పుస్తకాన్ని ఆర్డర్ చేసారు.. మా దగ్గర స్టాక్ ఉంది, కానీ అది పాడైంది. అందుకే మీకు మరో పుస్తకాన్ని పంపుతున్నాం. ఆర్డర్‌ని క్యాన్సిల్‌ చేసి...దయచేసి ఆ పుస్తకాన్ని తిరిగివ్వండి. నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వకండి ప్లీజ్‌ ధన్యవాదాలండి.'' దీంతో నెటిజనులు విభిన్నంగా స్పందించారు. పోనీలే, ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేసుకోమని కొందరన్నారు. సారీ చెప్పి.. నోట్ పెడితే సరిపోతుందా..ఆ బుక్‌ వచ్చేదాకా వెయిట్‌ చేయొచ్చు కదా అని మరొకరు కామెంట్‌ చేశారు. మరోవైపు అసౌకర్యానికి క్షమాపణలు చెపుతూ అమెజాన్‌  హెల్ప్‌ ట్విటర్‌ హ్యాండిల్‌ స్పందించింది. 

మరిన్ని వార్తలు