రికవరీ బూస్ట్‌‌- మార్కెట్ల సరికొత్త రికార్డ్స్‌ 

4 Dec, 2020 15:57 IST|Sakshi

జీడీపీపై ఆర్‌బీఐ అంచనాల ఎఫెక్ట్

‌తొలిసారి 45,000 పాయింట్లను దాటిన సెన్సెక్స్‌

447 పాయిం‍ట్లు అప్‌- 45,080 వద్ద ముగింపు‌

125 పాయింట్లు ఎగసి 13,259 వద్ద నిలిచిన నిఫ్టీ

చరిత్రాత్మక గరిష్టాల వద్ద ముగిసిన మార్కెట్లు

ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభాల్లోనే

ముంబై, సాక్షి: దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటపట్టినట్లు ఆర్‌బీఐ తాజాగా అభిప్రాయపడటంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ 447 పాయింట్లు జంప్‌చేసి 45,080 వద్ద ముగిసింది. వెరసి మార్కెట్‌ చరిత్రలో తొలిసారి 45,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఈ బాటలో నిఫ్టీ 125 పాయింట్లు ఎగసి 13,259 వద్ద నిలిచింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాలను సాధించాయి. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో జీడీపీ 5.6 శాతం క్షీణించవచ్చంటూ తొలుత వేసిన అంచనాలను తాజాగా 0.1 శాతం వృద్ధిగా ఆర్‌బీఐ సవరించడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు వచ్చే ఏడాది మొదట్లో కరోనా వైరస్‌ కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న ఆశలు ప్రోత్సాహాన్నిచ్చినట్లు తెలియజేశారు. కాగా.. ఒక దశలో సెన్సెక్స్‌ 45,148 వద్ద, నిఫ్టీ 13,280 వద్ద ఇంట్రాడేలో సరికొత్త గరిష్టాలను తాకడం విశేషం! 

బ్యాంకింగ్‌ జోరు
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ, ఫార్మా, మెటల్ 2-1.2 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్‌, ఐసీఐసీఐ, హిందాల్కో,  అల్ట్రాటెక్‌, సన్‌ ఫార్మా, ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్‌, గ్రాసిమ్‌, ఇండస్‌ఇండ్‌ 5-2.3 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, బజాజ్ ఫిన్‌, బీపీసీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. చదవండి: (80% విమానాలకు ఓకే- షేర్లకు రెక్కలు)

టాటా కెమ్‌ జోష్
డెరివేటివ్స్‌లో టాటా కెమికల్స్‌, ఇండిగో, బంధన్‌ బ్యాంక్‌, డీఎల్‌ఎఫ్‌, పేజ్‌, టాటా పవర్‌, గ్లెన్‌మార్క్‌ 8-3.3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు అంబుజా, ఏసీసీ, శ్రీరామ్‌ ట్రాన్స్‌, జీఎంఆర్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, ఐడియా, పిరమల్‌, ఐసీఐసీఐ లంబార్డ్‌, కోఫోర్జ్‌ 3.2-1.5 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.4 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,646 లాభపడగా.. 1,245 నష్టాలతో ముగిశాయి.

ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్‌మెంట్స్
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,637 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1,440 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 357 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,636 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 3,242 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 1,043 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా