మాన్‌సూన్‌ బూస్ట్‌: సెన్సెక్స్‌ దౌడు

30 May, 2022 15:37 IST|Sakshi

16650 పాయింట్ల ఎగువకు నిఫ్టీ

56 వేల స్థాయిని టచ్‌ చేసిన సెన్సెక్స్‌

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఆరంభంలో దూకుడు ప్రదర్శించాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంతాకేలతో  భారీగా లాభపడిన సెన్సెక్స్‌ ఆ జోరును కంటిన్యూ చేసింది. ఒక దశలో1110 పాయింట్లకు పైగా ఎగిసి 56 వేల ఎగువకు చేరింది. అటు నిఫ్టీ కూడా 16650 కీలక మద్దతు స్థాయికి ఎగువన పటిష్టంగా కదలాడింది. అయితే మిడ్‌సెషన్‌నుంచి అమ్మకాల దోరణి  ఫలితంగా సెన్సెక్స్‌ సెన్సెక్స్‌ 1041 పాయింట్లు, నిఫ్టీ 309 పాయింట్లు లాభంతో స్థిరపడ్డాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిసాయి.  

సాధారణం కంటే మూడు రోజుల ముందుగానే రుతుపవనాలు కేరళకు  రానున్నాయని వాతావరణ శాఖ ఆదివారం ప్రకటించిన నేపథ్యంలో ఎఫ్‌ఎంసీజీ, ఆటో ఐటీ రంగాలు భారీ లాభాలనార్జించాయి. 4.22శాతం లాభంతో ఇన్ఫోసిస్ టాప్ గెయినర్‌గా నిలవగా, రియలన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎంఅండ్ఎం, యూపీఎల్, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లాభపడ్డాయి.

ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్, విప్రో, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌డిఎఫ్‌సి, టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టి, టీసీఎస్‌, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్,  ఎం అండ్ ఎం, టైటన్‌ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. మరోవైపు ఎన్‌ఎస్‌ఈలో కోటక్‌ మహీంద్ర, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సన్‌ఫార్మా, ఓఎన్‌జీసీ, డా. రెడ్డీస్‌,  ఐటీసీ బాగా నష్టపోయాయి. 

అటు డాలరు మారకంలో రూపాయి కూడా లాభపడింది. ఈక్విటీ మార్కెట్ల దన్నుతో ఆరంభంలోనే  77.46 వద్ద 12 పైసలు ఎగిసింది.  చివరికి 77.50 వద్ద  ముగిసింది. మే 20తో  వారంలో  దేశీయ విదేశీ మారక నిల్వలు పది వారాల పాటు క్షీణించిన తర్వాత తొలిసారి పుంజుకున్నాయి. 4 బిలియన్‌ డాలర్ల పైగా పెరిగాయి.  

మరిన్ని వార్తలు