మెర్సిడెస్ బెంజ్ సూపర్ ఎలక్ట్రిక్ కారు.. కి.మీ రేంజ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

4 Jan, 2022 17:59 IST|Sakshi

ఇప్పటివరకు ఒక లెక్క.. నేను వచ్చాక మరో లెక్క అంటుంది ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్. ఇప్పటి వరకు చాలా కంపెనీలు 500కిమీ లోపు రేంజ్ గల ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకొనివచ్చేవి. అయితే, మెర్సిడెస్ బెంజ్ మాత్రం అంతకు మించి రేంజ్ తో వస్తాను అని అంటుంది. ఎట్టకేలకు, మెర్సిడెస్ తన విజన్ ఈక్యూఎక్స్ఎక్స్ మోడల్ ప్రోటోటైప్ వివరలను విడుదల చేసింది. దీనిని ఫార్ములా F1 బృందం నిపుణుల చేత డిజైన్ చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ విజన్ ఈక్యూఎక్స్ఎక్స్ కాన్సెప్ట్ అనేది ఇప్పటివరకు అభివృద్ధి చేసిన అత్యంత సమర్థవంతమైన మెర్సిడెస్ కారుగా నిలిచినట్లు సంస్థ పేర్కొంది. 

ఈ కారును ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే ఆగకుండా 1,000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది అని మెర్సిడెస్ తెలిపింది. ఈ కారు అల్ట్రా సన్నని సోలార్ ప్యానెల్స్ తో కూడా వస్తుంది. యుకెలోని మెర్సిడెస్-ఎఎంజి హై పెర్ఫార్మెన్స్ పవర్ ట్రైన్స్ విభాగానికి చెందిన ఎఫ్ 1 నిపుణుల సహాయంతో అభివృద్ధి చేసిన కొత్త కెమిస్ట్రీని బ్యాటరీ కలిగి ఉందని బ్లూమ్ బెర్గ్ నివేదించింది. ఈ బ్యాటరీ ఈక్యూఎస్ లోపల బ్యాటరీ కంటే 30 శాతం కంటే తక్కువ బరువు ఉంటుంది. ఈవీ కార్లలో ఎరోడైనమిక్స్‌ ఫీచర్‌తో, అత్యధిక వేగంగా వెళ్లే కారుగా విజన్‌ ఈక్యూఎక్స్‌ఎక్స్‌ నిలుస్తోందని కంపెనీ సీవోవో మార్కస్‌ స్కాఫర్‌ వెల్లడించారు. మెర్సిడెస్ 2030 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

(చదవండి: జియోకు పోటీగా...బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపరాఫర్‌..!)

మరిన్ని వార్తలు