సూక్ష్మ రుణాలు రూ.2.93 లక్షల కోట్లు

24 Sep, 2022 08:46 IST|Sakshi

జూన్‌ క్వార్టర్‌లో 23.5 శాతం పెరుగుదల

ఎంఎఫ్‌ఐఎన్‌ నివేదిక

ముంబై: సూక్ష్మ రుణ సంస్థల స్థూల రుణ పోర్ట్‌ఫోలియో జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 23.5 శాతం వృద్ధి చెంది (అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే) రూ.2,93,154 కోట్లకు చేరుకుంది. ఇక ఈ ఏడాది మార్చి త్రైమాసికం చివరికి ఉన్న రూ.2.85 లక్షల కోట్ల రుణాలతో పోల్చి చూస్తే కనుక.. 2.7 శాతం పెరిగాయి. సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్‌ఐలు) స్వీయ నియంత్రణ సంస్థ ‘మైక్రో ఫైనాన్స్‌ ఇనిస్టిట్యూషన్స్‌ నెట్‌వర్క్‌’ (ఎంఎఫ్‌ఐఎన్‌) ఓ నివేదిక విడుదల చేసింది.

రానున్న త్రైమాసికాల్లో రుణాల పోర్ట్‌ఫోలియో మరింత వృద్ధి చెందుతుందని ఎంఎఫ్‌ఐఎన్‌ సీఈవో అలోక్‌ మిశ్రా తెలిపారు. నియంత్రణ పరమైన, నిర్వహణపరమైన సానుకూల వాతావరణం ఉన్నట్టు చెప్పారు. కరోనా తర్వాత జారీ చేసిన రుణాల్లో నాణ్యత 95 శాతానికి పైగా (వసూళ్లు) ఉన్నట్టు ఎంఎఫ్‌ఐఎన్‌ చైర్మన్‌ దేవేశ్‌ సచ్‌దేవ్‌ పేర్కొన్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలంలో శాఖల బలమైన విస్తరణకుతోడు గతంలో నిలిచిన డిమాండ్‌ తోడు కావడం, సానుకూల విధానాలతో ఎంఎఫ్‌ఐ రంగం మంచి వృద్ధిని నమోదు చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

చదవండి:  TCS Work From Home Ends: టీసీఎస్‌ భారీ షాక్‌.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా!

మరిన్ని వార్తలు