ముఖేష్ అంబానీకి మరో మెయిల్! అడిగింది ఇవ్వకుంటే చంపేస్తామంటూ..

29 Oct, 2023 18:06 IST|Sakshi

భారతదేశంలో అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ 'ముఖేష్ అంబానీ'కి (Mukesh Ambani) గత 48 గంటల్లో రెండు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. అక్టోబర్ 27న పంపిన మెయిల్‌లో రూ.20 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన నిందితుడు.. అదే మెయిల్ నుంచి రూ. 200 కోట్లు ఇవ్వాలని, లేకుంటే చంపుతామని బెదిరిస్తూ మెయిల్ చేసాడు.

ఇండియాలో మాకు అత్యుత్తమ షూటర్లు ఉన్నారని, అడిగిన డబ్బు ఇవ్వకుంటే చంపుతామని మెయిల్‌లో నిందితుడు ప్రస్తావించారు. దీనిపైన యాంటిలియా సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ దేవేంద్ర మున్షీరామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిందితుడు యూరప్‌కు చెందిన ఈ-మెయిల్ సర్వీస్ ప్రొవైడర్‌ ఉపయోగించాడని, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ ద్వారా అతడిని గుర్తించాలని లేఖ రాశామని పోలీసు అధికారి తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 387, 506 (2) కింది గుర్తు తెలియని వ్యక్తి మీద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: రూ.1200 సంపాదనతో మొదలై.. రూ.9800 కోట్ల కంపెనీ నడిపిస్తోంది! ఎవరీ గజల్ అలఘ్..

ముఖేష్ అంబానీ కుటుంబానికి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది అక్టోబర్ 5న రిలయన్స్ ఫౌండేషన్‌కు చెందిన ఒక హాస్పిటల్‌కి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఆసుపత్రిలో బాంబ్ పేల్చనున్నట్లు పేర్కొన్నాడు. ఆ తరువాత రోజే ఫోన్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ముఖేష్ అంబానీ వారసులు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులైన సందర్భంగా ఈ బెదిరింపు మెయిల్ రావడం గమనార్హం.

మరిన్ని వార్తలు