కొడుకు అరుస్తాడు.. నా మద్దతు కోడలికే: విజయపత్ సింఘానియా

24 Nov, 2023 16:04 IST|Sakshi

రేమండ్ ఎండీ, ఛైర్మన్ గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోడీ సింఘానియాతో విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గౌతమ్ తండ్రి, రేమండ్‌ సృష్టికర్త విజయపత్ సింఘానియా కొడుకుతో పాటు కోడలితో తనకున్న సంబంధాన్ని వివరించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను మాట్లాడారు. 

‘నిత్యం ఎక్కడోచోట దంపుతులు వీడిపోతున్న వార్తలు చూస్తూంటాం. కానీ నా కొడుకు, కోడలే ఆ వార్తల్లో ఉంటారని అనుకోలేదు. తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాను. ఇద్దరు అన్ని విషయాలు తెలిసినవారు. విడాకుల విషయమై నా కోడలితో ఏదైనా సాయం కావాలా? అని అడిగాను. కానీ అందుకు తాను ఒప్పుకోలేదు. తన తండ్రి సీనియర్‌ అడ్వకేట్‌గా పనిచేశారు. నవాజ్‌కు కూడా న్యాయసంబంధ విషయాలు బాగా తెలుసు. గౌతమ్‌, నవాజ్‌ విషయంలో నేను జోక్యం చేసుకోను. నా కోడలు ఎప్పడు సహాయం అడిగినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇద్దరూ కలిసి జీవించాలనుకుంటున్నాను. కానీ గౌతమ్‌ నా మాట వినడు. తనకు నచ్చని విషయం చెబితే నాపై అరుస్తాడు. అందుకే వీలైనంత దూరంగా ఉంటాను. నా నైతిక మద్దతు కోడలికే. ఈ పరిణామాలు అన్నింటివల్ల రేమండ్‌ బిజినెస్‌ ప్రభావం చెందే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని మదుపరులు ఎలా చూస్తున్నారనేదే ప్రధానం. నా కోడలు గౌతమ్‌పై చాలా పోరాడాల్సి ఉంటుంది. అతడు గెలవడానికి ఏదైనా చేస్తాడు. లాయర్లను సైతం కొనుగోలు చేయడానికి వెనుకాడడు. నవాజ్‌ మంచి లాయర్‌ను నియమించుకోవాలంటే చాలా డబ్బు అవసరం ఉంటుంది. అందుకే 75 శాతం(రూ.8 వేల కోట్లు) వాటా అడిగి ఉండవచ్చు’అని విజయ్‌పత్‌ సింఘానియా తెలిపారు.

ఇదీ చదవండి: హైదరాబాద్‌, బెంగళూరులో ఆస్తులు అమ్మేయనున్న విప్రో..?

తాజాగా గౌతమ్-నవాజ్ మోదీ మధ్య సెప్టెంబరులో వివాదం ఏర్పడింది. వాస్తవానికి ఒక బాత్ రూమ్ విషయంలో కుమార్తె, భార్యలపై సింఘానియా చేయి చేసుకున్నాడు. వారిని విచక్షణా రహితంగా కొట్టినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో తమను తాము కాపాడుకునేందుకు నీతా అంబానీ, అనంత్ అంబానీల సహాయం తీసుకున్నట్లు నవాజ్ మోదీ తెలిపారు.

రేమండ్‌ స్వరూపం..

  • రేమండ్‌ మార్కెట్‌ క్యాపిటల్‌ రూ.12 వేల కోట్లు.
  • ప్రధాన కేంద్రం ముంబయిలో ఉంది.
  • మొత్తం మార్కెట్‌ షేర్‌లో 60శాతం రేమండ్‌ బిజినెస్‌ ఆక్రమించింది.
  • దేశవ్యాప్తంగా దాదాపు 4000 అవుట్‌లెట్లు ఉన్నాయి.
  • 637 రిటైల్‌స్టోర్లు కలిగి ఉంది.
  • ప్రపంచ వ్యాప్తంగా 55 దేశాల్లో సంస్థ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
  • సుమారు 20,000 డిజైన్‌లలో ఉత్పత్తులు తయారుచేస్తోంది.
మరిన్ని వార్తలు