Taj Hotel Data Breach: తాజ్ హోటల్స్‌పై సైబర్ అటాక్ - ప్రమాదంలో 15 లక్షల మంది డేటా!

24 Nov, 2023 15:59 IST|Sakshi

టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో సైబర్ దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్ 'ఇండస్ట్రీయల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా'(ఐసీబీసీ) మీద జరిగిన సైబర్ దాడి మరువకముందే.. టాటా గ్రూపుకు చెందిన తాజ్ హోటల్ గ్రూప్‌పై సైబర్ అటాక్ జరిగినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

2023 నవంబర్ 5న తాజ్ హోటల్ గ్రూప్‌పై సైబర్ అటాక్ జరిగినట్లు, తాజ్ హోటల్‌కు చెందిన సుమారు 15 లక్షల మంది డేటాను హ్యాక్ చేసినట్లు తెలిసింది. నిందితులు ఈ డేటాను తిరిగి ఇవ్వాలంటే 5000 డాలర్లు డిమాండ్ చేస్తూ కొన్ని షరతులను కూడా విధించినట్లు తెలుస్తోంది.

వినియోగదారులు భయపడాల్సిన అవసరం లేదని.. దీనిపైనా సమగ్ర పరిశీలను జరుగుతోందని, డేటా గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంబంధిత అధికారులు వెల్లడించారు. 

Dnacookies అనే పేరుతో హ్యాకర్లు కస్టమర్ల డేటాను హ్యాక్ చేసినట్లు, ఇప్పటికి ఈ డేటాను ఎవరికీ ఇవ్వలేదని వెల్లడించారు. కస్టమర్ ఐడీ, అడ్రస్ వంటి ఇతర వ్యక్తిగత సమాచారాలను వారు హ్యాచ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కస్టమర్ డేటా 2014 నుంచి 2020 వరకు ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్‌ హ్యాండ్‌ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే..

ఈ సంఘటనపై ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సిఎల్) ప్రతినిధి మాట్లాడుతూ.. కస్టమర్ల డేటా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీనికి కారకులైన వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, దీని గురించి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) అధికారులకు కూడా ఇప్పటికే తెలియజేసినట్లు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు