నష్టాల్లోకి నెట్‌వర్క్‌18 మీడియా

19 Oct, 2022 10:43 IST|Sakshi

న్యూఢిల్లీ: రెండో త్రైమాసికంలో ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగ కంపెనీ నెట్‌వర్క్‌18 మీడియా అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో దాదాపు రూ. 29 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 199 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 12 శాతం బలపడి రూ. 1,549 కోట్లకు చేరింది.

గత క్యూ2లో రూ. 1,387 కోట్ల టర్నోవర్‌ నమోదైంది. అయితే మొత్తం వ్యయాలు సైతం 34 శాతం ఎగసి రూ. 1,592 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో నెట్‌వర్క్‌18 మీడియా షేరు బీఎస్‌ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 70 వద్ద ముగిసింది.

చదవండి: ఆ కారు క్రేజ్‌ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్‌.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు!

మరిన్ని వార్తలు