వచ్చే కొన్ని నెలలు భారత్‌కు కీలకం

10 Apr, 2021 05:48 IST|Sakshi

ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌

న్యూఢిల్లీ: వచ్చే కొన్ని నెలలు భారత్‌కు కీలకమని.. పెరిగిపోతున్న కరోనా కేసులు ఆర్థిక రికవరీకి సవాళ్లను తీసుకురావచ్చని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ అంచనా వేసింది. ఇప్పటి వరకు చూస్తే ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తక్కువగానే ఉందంటూ.. అయినప్పటికీ భారత విధాన కర్తలు నిర్లక్ష్యానికి ఏ కొంచెం కూడా అవకాశం ఇవ్వరాదని పేర్కొంది. కఠిన లాక్‌డౌన్‌లను విధించే విషయంలో రాష్ట్రాలు పునరాలోచిస్తుండడడంతో ఆర్థిక ప్రభావం గతేడాది ద్వితీయ త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుతం తక్కువగానే ఉంటుందని అంచనా వేసింది. కరోనా కేసుల కట్టడికి కావాల్సిన స్థాయిలో భారత్‌లో టీకాల కార్యక్రమం నడవడం లేదని అభిప్రాయపడింది. ఆరోగ్య పరిస్థితులు మరింత దారుణంగా మారి, కఠినమైన నియంత్రణలను అమలైతే కనుక 2021 సంవత్సరం మొదటి ఆరు నెలలకు సంబంధించి భారత ఆర్థిక వ్యవస్థపై తమ అంచనాలు ప్రభావితం కావొచ్చని పేర్కొంది. 

మరిన్ని వార్తలు