Stock Market: లాభాల జోరు: సరికొత్త గరిష్టానికి నిఫ్టీ

1 Jun, 2021 09:49 IST|Sakshi

15600   ఎగువకునిఫ్టీ

52100 స్థాయిని అధిగమించిన సెన్సెక్స్‌

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లో వరుసగా రెండో సెషన్లో లాభాల జోరును కంటిన్యూ చేస్తున్నాయి. దీంతో నిఫ్టీ 15600వద్ద రికార్డు స్థాయిని దాటేసింది. అటు సెన్సెక్స్‌ 52వేల ఎగువకు చేరగా, ప్రస్తుతం సెన్సెక్స్‌ 261 పాయింట్లు ఎగిసి 52198 వద్ద, నిఫ్టీ 66 పాయింట్ల లాభంతో 15649 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మెటల్‌, ఫార్మా మినహా దాదాపు అన్ని రంగాల షేర్లలోను  కొనుగోళ్ల ధోరణి కనిపిస్తోంది. బజాజ్ ఆటో, ఓఎన్‌జిసి, హెచ్‌డిఎఫ్‌సి, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతి సుజుకి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ లాభాలలో ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడీస్, టీసీఎస్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్,టాటా స్టీల్, జెఎస్‌డబ్ల్యు స్టీల్ , హిందాల్కో  నష్టపోతున్నాయి.

ఆసియా మార్కెట్ల సానుకూల ధోరణికి తోడు,  ప్రధానంగా జీడీపీ అంచనాలు ఊహించినదానికంటే మెరుగ్గా ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు సెంటిమెంట్‌ బలంగా ఉంది.  అయితే దేశ జీడీపీపై కరోనా ప్రభావం భారీగానే పడింది. నాలుగు దశాబ్దాల కనిష్ఠానికి పతనమైంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఓ) సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జీడీపీ 2020-21లో 7.3 శాతం తగ్గింది. గత త్రైమాసికంలో (జనవరి-మార్చి 2021) ఇది 1.6 శాతం పెరిగింది. 2020-21 ఆర్ధిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 1.6 శాతం వృద్ధిని సాధించినట్లు ఎన్ఎస్ఓ వెల్లడించింది. మూడో త్రైమాసికంతో పోలిస్తే 0.5 శాతం పెరుగుదల కనిపించిందని వెల్లడించింది. 

చదవండి:  40 ఏళ్ల కనిష్టానికి...జీడీపీ

మరిన్ని వార్తలు