ధూమపానం.. లంగ్‌ క్యాన్సర్‌ లింక్‌కు ఆధారాల్లేవు!

3 Oct, 2021 05:08 IST|Sakshi

బీమా చెల్లించాలని కన్జూమర్‌ కోర్టు ఆదేశం

అహ్మదాబాద్‌: ఒక పేషెంటు అతిగా పొగతాగడం వల్ల మరణించాడని పేర్కొంటూ క్లెయిమ్‌ చెల్లించేందుకు నిరాకరించిన బీమా కంపెనీకి వినియోగదారుల కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సదరు పేషెంటుకు వైద్య బీమా వ్యయ మొత్తాన్ని ఇవ్వాలని కంపెనీని ఆదేశించింది. పొగతాగడం వల్లనే సదరు పేషెంటుకు లంగ్‌క్యాన్సర్‌ వచి్చందనేందుకు సరైన ఆధారాల్లేవని కోర్టు అభిప్రాయపడింది. కేవలం చికిత్స రిపోర్టులో పొగతాగడం అలవాటైంది(అడిక్షన్‌ స్మోకింగ్‌) అని రాయడాన్ని తిరస్కరణకు కారణంగా పేర్కొనలేమంది.

పొగతాగని వాళ్లకు కూడా లంగ్‌క్యాన్సర్‌ వస్తుందని గుర్తు చేసింది. అలోక్‌ కుమార్‌ బెనర్జీ అనే వ్యక్తి ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణించారు. అతని వైద్య చికిత్సకు అయిన రూ. 93,927 చెల్లించేందుకు బీమా కంపెనీ తిరస్కరించింది. దీంతో బెనర్జీ భార్య స్మిత కన్జూమర్‌ కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం సదరు మొత్తాన్ని 7 శాతం వడ్డీతో కలిపి 2016 ఆగస్టు నుంచి లెక్కించి ఇవ్వాలని పేర్కొంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు