భార్య సిజేరియన్‌ వల్లే..అనారోగ్యానికి గురయ్యానంటూ ఓ భర్త..

20 Sep, 2023 12:38 IST|Sakshi

చాలా విచిత్రమైన కేసులు చూసుంటాం. ఇలాంటి విచిత్రమైన కేసు చూసే అవకాశం లేదు. అవకాశం దొరకాలే కానీ చిన్న కారణంతో అవతల వాళ్లని ఇబ్బంది పెట్టి డబ్బులు గుంజాలని చూస్తుంటారు‍ కొందరూ. అలాంటి కోవకు చెందని వాడే భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్‌ వ్యక్తి. ఎంత విచిత్రమైన ఆరోపణలతో కోర్టు మెట్లు ఎక్కాడో వింటే ఆశ్చర్యపోతారు. కేసు నిలబడుతుందనుకున్నాడో, తన వాదన నెగ్గుతుందనో తెలియదు చాలా హాస్యస్పదమైన ఆరోపణలతో కేసు వేశాడు. చివరికీ ఏమైందంటే..

ఆస్ట్రేలియాకు చెందిన భారత సంతతి వ్యక్తి అనిల్‌ కొప్పుల అనే వ్యక్తి భార్యకు 2018లో రాయల్‌ ఉమెన్స్‌ హాస్పటల్స్‌ సీజేరియన్‌ ఆపరేషన్‌ చేసి బిడ్డను తీశారు. అక్కడ ఆస్పత్రి నిబంధనల ప్రకారం భార్య ఆపరేషన్‌ టైంలో భర్త పక్కనే ఉండి ధైర్యం చెప్పేలా ప్రోత్సహిస్తారు. అతడు కూడా ఆపరేషన్‌ థియోటర్‌లో వైద్యుల తోపాటే ఉన్నాడు. అప్పటి నుంచి మెంటల్‌గా డిస్ట్రబ్‌ అయ్యాను. మానసిక అనారోగ్యానకి గురయ్యాను. ఆ ఆపరేషన్‌లో నా భార్య అంతర్గత అవయవాలు, బ్లీడింగ్‌ చూడటం కారణంగా తన వైవాహిక జీవితం కూడా సరిగా లేదని ఆరోపణలు చేస్తూ కోర్టు మెట్లు ఎక్కాడు అనిల్‌ కొప్పుల.

తన మానసికా ఆరోగ్యం, వైవాహిక జీవితం దెబ్బతినడానికి కారణమైన సదరు ఆస్పత్రిపై చర్యలు తీసుకోవడమే గాక అందుకు ప్రతిగా రూ. 5వేల కోట్లు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కేసు పెట్టాడు. సోమవారం విక్టోరియాలోని సుప్రీం కోర్టు వాదోపవాదనలు విన్నాక తల్లి బిడ్డల సంరక్షణ విషయమై వైద్యులు సీజేరియన్‌ ఆప్షన్‌ ఎంచుకుంటారు. తల్లి, బిడ్డల సంరక్షణ కోసం భర్తను థియెటర్‌లోని అనుమతించడం అనేది కూడా సర్వసాధారణ విషయం. దీని వల్ల అతను ఎలాంటి ఆర్థిక నష్టాన్ని చవిచూడలేదు. పైగా అతను ఆరోపిస్తున్న మానసికి అనారోగ్యం అనేది తీవ్రమైన గాయం కింద పరిగణించేది కాదని తేల్చి చెప్పింది.  అందువల్ల అతనికి ఎలాంటి నష్ట పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ..కోర్టు అతడి కేసుని తోసిపుచ్చింది. 

(చదవండి: బొప్పాయి గింజలు పడేస్తున్నారా..? తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే..)

మరిన్ని వార్తలు