ఎన్ఎస్‌డీఎల్: అదానీకి భారీ షాక్‌

14 Jun, 2021 10:54 IST|Sakshi

సుమారు 45 వేల కోట్ల  విలువైన షేర్లు ఫ్రీజ్‌

రూ. 45 వేల కోట్లు  ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐలు

ఫారిన్ ఫండ్స్ ఖాతాలు బ్లాక్‌  

సాక్షి, ముంబై: అదానీ గ్రూప్‌నకు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్‌డీఎల్)భారీ షాక్‌ ఇచ్చింది. కంపెనీకి చెందిన మూడు విదేశీ ఫండ్ల ఖాతాలను స్తంభింపజేసింది. నాలుగు అదానీ గ్రూప్ కంపెనీలల రూ.43,500 కోట్ల విలువైన షేర్లను ఫ్రీజ్‌ చేసింది. డిపాజిటరీ వెబ్‌సైట్ ప్రకారం అల్బులా ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్,క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్‌మెంట్ఫండ్ ఖాతాలుమే 31న లేదా అంతకుముందే వీటిని స్తంభింపజేసినట్టు తెలుస్తోంది.

మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం సరైన సమాచారాన్ని బహిరంగ పరచడంలో ఈ 3 కంపెనీలు విఫలమైనట్టు తెలుస్తోంది. నిబంధనలు పాటించడంలో విఫలమైతే ఖాతాలను స్తంభింపజేయవచ్చు. దీంతో ఈ ఫండ్స్ ఇప్పటికే ఉన్న సెక్యూరిటీలలో దేనినీ విక్రయించలేవు లేదా కొత్త సెక్యూరిటీలను కొనలేవు. అదానీ గ్రూప్‌లో ఆరు లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. మారిషస్‌కు చెందిన  మూడుకంపెనీలు అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ 6.82 శాతం, అదానీ ట్రాన్మిషన్‌ 8.03 శాతం, అదానీ టోటల్ గ్యాస్‌ 5.92 శాతం, అదానీ గ్రీన్  3.58 శాతం  వాటాలను కలిగి ఉన్నాయి.  అదానీ గ్రూప్ గత ఏడాదిలో 200శాతం నుంచి 1,000 శాతం మధ్య లాభపడింది. అయితే దీనిపై అదానీ గ్రూప్ ఇంకా స్పందించలేదు.

తాజా వార్తతో స్టాక్‌మార్కెట్లో అదానీ గ్రూపు షేర్లలో  భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్  25 శాతం క్షీణించి ఇంట్రాడే కనిష్టానికి 1,201.10 డాలర్లకు చేరుకుంది.దీంతో  సంస్థ మార్కెట్ క్యాప్ 1,40,500.74 కోట్లకు పడిపోయింది. అదానీ పోర్టు 19 శాతం క్షీణించి, ఇంట్రాడే కనిష్టానికి 681.50 రూపాయలకు చేరుకుంది. సంస్థ మార్కెట్ క్యాప్ 1,46,444.65 రూపాయలకు పడిపోయింది.  అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్ , అదానీ ట్రాన్స్మిషన్  5 శాతం పతనమై లోయర్‌ సర్క్యూట్‌ వద్ద ఫ్రీజ్‌​ అయ్యాయి. 

చదవండి: stockmarket: అదానీ షాక్‌, భారీ నష్టాలు

>
మరిన్ని వార్తలు