డెలివరీ బాయ్‌తో భవిష్ అగర్వాల్ సెల్ఫీ: ఓలా స్కూటర్‌తో చాలా అదా అంటూ..

2 Mar, 2023 10:57 IST|Sakshi

ఓలా ఎలక్ట్రిక్ ప్రారంభంలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో సజావుగా ముందుకు సాగిపోతోంది. క్రమంగా కంపెనీ అమ్మకాలు కూడా వృద్ధి చెందుతున్నాయి. ఇటీవల భవిష్ అగర్వాల్ ఒక ఆసక్తికరమైన ఫోటోను ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు.

భవిష్ అగర్వాల్ షేర్ చేసిన ఫొటోలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌తో ఉన్న జొమాటో డెలివరీ బాయ్‌ని చూడవచ్చు. ఈ డెలివరీ బాయ్ 9 నెలల్లో లక్ష కంటే ఎక్కువ ఖర్చులను ఆదా చేసాడని, అతడు రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను వాడుతున్నాడని కూడా భవిష్ ట్విట్టర్ పోస్ట్‌లో రాశాడు.

జొమాటో డెలివరీ బాయ్ ఉపయోగించే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకదానిలో ఛార్జింగ్  పూర్తయినప్పుడు, ఇంకోదానిని ఉపయోగిస్తాడు. అప్పుడు ఛార్జింగ్ కాలీ అయిన స్కూటర్‌కి ఛార్జింగ్ వేసుకుంటాడు. ఈ విధంగా రెండు స్కూటర్లను నిరంతరం ఉపయోగిస్తూనే ఉన్నాడు

డెలివరీ బాయ్ సంతోష్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో 50,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాడు. దీంతో సాధారణ 9 నెలల్లో లక్షకంటే ఎక్కువ ఆదా చేసాడని చెప్పాడు. ప్రస్తుతం ఎక్కువమంది ఉపయోగిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఓలా కంపెనీ స్కూటర్లు ఉండటం గమనార్హం.

ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ఎస్1, ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఓలా ఎస్1 ప్రో 4 కిలోవాట్ లిథియం ఆయన బ్యాటరీతో 181 కిమీ పరిధిని అందిస్తుందని ARAI ద్వారా ధృవీకరించబడింది. ఇది 750W కెపాసిటీ గల పోర్టబుల్ ఛార్జర్‌తో దాదాపు 6 గంటల్లో, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75 శాతం వరకు ఛార్జ్ చేయబడుతుంది. 

ఓలా ఎలక్ట్రిక్ గత ఏడాది దీపావళి సందర్భంగా 'ఎస్1 ఎయిర్' స్కూటర్ లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 84,999 (ఎక్స్-షోరూమ్). ఇది ఒక ఫుల్ చార్జ్ తో గరిష్టంగా 101 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇందులో 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ మరియు 4.5 కిలోవాట్ హబ్-మౌంటెడ్ మోటారు ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు.

>
మరిన్ని వార్తలు