Top 15 Best Street Foods: ఇక్కడ ఒక్కసారి స్ట్రీట్‌ఫుడ్స్‌ రుచి చూశారంటే స్టార్‌ హోటల్‌ కూడా దండగే

7 Nov, 2023 10:59 IST|Sakshi

మన దేశంలో స్ట్రీట్‌ఫుడ్‌కి ఉన్న డిమాండ్‌ అంతాఇంతా కాదు. ఎందుకంటే వీటిలో దొరికే రుచి పెద్దపెద్ద ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌లోనూ లభించదు కాబట్టి. ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఆహార పద్ధతులు మారుతూ ఉంటాయి. ఇక మన​ దేశంలో ఎన్నో రకాల ప్రత్యేకమైన, విభిన్నమైన వంటకాలు అందుబాటులో ఉన్నాయి.

ముఖ్యంగా స్ట్రీట్‌ ఫుడ్స్‌ వద్ద కనిపించే జససందోహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఈ మధ్య బీటెక్‌ చాయ్‌వాలీ దగ్గర్నుంచి, గ్రాడ్యుయేట్‌ పానీపూరీ వరకు.. ఎంతోమంది యువత సైతం స్ట్రీట్‌ ఫుడ్‌ అమ్ముతూ తమకంటూ సొంత గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఏ వీధి చూసినా స్ట్రీట్‌ఫుడ్‌ వద్ద జనం కిటకిటలాడుతుంటారు. మరి మన దేశంలో తప్పకుండా రుచి చూడాల్సిన స్ట్రీట్‌ఫుడ్స్‌ ఏంటన్నది చూసేద్దామా..


ఫేమస్‌ స్ట్రీట్‌ ఫుడ్స్‌, అవి ఎక్కడ దొరుకుయన్నది ఓసారి పరిశీలిస్తే..

1. ముంబైలోని జోగేశ్వరిలో- ఫరీద్‌ సీఖ్‌పరాట
2. అర్‌సలన్‌ బిర్యానీ- పార్క్‌ స్ట్రీట్‌, కోల్‌కతా
3. అంబర్‌ వడాపావ్‌- కల్యాణ్‌, ముంబై
4. బటర్‌ చికెన్‌- రాజీందర్‌ దా డాబా- సఫ్దర్‌జంగ్‌, ఢిల్లీ
5. మిసల్‌ పావ్‌ బేడ్‌కర్‌- మిసల్‌, ఫూణె


6. ప్యాజ్‌ కచోరి రావత్‌ మిస్తాన్‌ బాంఢర్‌- జైపూర్‌
7. మూల్‌చంద్‌ పరాటా- లాజ్‌పత్‌ నగర్‌, ఢిల్లీ
8. షాదాబ్‌ బిర్యానీ- హైదరాబాద్‌
9. సర్దార్‌ పావ్‌ భాజీ- ముంబై
10. సౌత్‌ ఇండియా బెస్ట్‌ ఉడిపి శ్రీ దర్శిని- ఎల్లిస్‌ బ్రిడ్జ్‌, అహ్మదాబాద్‌


11. రసగంగా మీల్స్‌- బెల్లందూర్‌, బెంగళూరు
12. కొరియన్‌ వ్రాప్‌-  బెంగళూరు
13. నటరాజ్‌దహీ భల్లే - చాందిని చౌక్‌, ఢిల్లీ
14. తండా కబాబ్‌- లక్నో
15. జోషి దహి వడ- ఇండోర్‌


 

ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో స్ట్రీట్‌ఫుడ్‌కి ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్‌ ఉందనే చెప్పాలి. అక్కడ చాట్‌, చట్పటా, పావ్‌బాజీ లాంటి ఎన్నో రెసిపిలు బాగా ఫేమస్‌. దేశంలో టాప్‌ 10 స్ట్రీట్‌ ఫుడ్స్‌ ఎక్కడ దొరుకుతాయంటే..

ఢిల్లీ: రోహిణి, చాందిని చౌక్‌, రాజౌరు గార్డెన్‌, లాజ్‌పుట్‌ నగర్‌.
ముంబై: మహమ్మద్‌ అలీ రోడ్‌, బాంద్రా, అంధేరీ, మలద్‌, ఘట్కోపర్‌
హైదరాబాద్‌: కూకట్‌పల్లి, ఓల్డ్‌సిటీ, టోలిచోకి
పూణె: శివాజీ నగర్‌, జేఎమ్‌ రోడ్‌

మరిన్ని వార్తలు