బడ్జెట్‌ తర్వాత పెట్రో సెగ షురూ

4 Feb, 2021 10:12 IST|Sakshi

సాక్షి, ముంబై: 2021 బడ్జెట్‌ అనంతరం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి మళ్లీ షాకిస్తున్నాయి. బడ్జెట్‌లో ఇంధనంపై అగ్రి సెస్సు విధించిన నేపథ్యంలో పెట్రోల ధరలపై చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన  ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అగ్రి సెస్‌ ప్రభావం  వినియోగదారుల మీద ఉండదని స్పష్టం చేశారు.  కానీ  గురువారం రోజు పెట్రోల్ ధర 35 పైసలు పెరిగింది. ఈ  పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో  లీటర్ పెట్రోల్ ధర రూ. 86.65కు చేరింది. డీజిల్ ధర రూ. 76.83కు చేరింది.  ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.20 పైసలకు చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.83.67 పైసలుగాఉంది.

చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.89.13 పైసలుండగా, డీజిల్ ధర రూ.82.04 
కోల్‌కత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ.88.01,, లీటర్ డీజిల్ ధర రూ.80.41
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ 90.10 పైసలుండగా, డీజిల్ ధర రూ.83.81
అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.78పైసలుండగా, డీజిల్ ధర రూ.85.99

పెట్రోల్, డీజిల్‌పై బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీలను తగ్గిస్తున్నామని కాబట్టి, వినియోగదారులపై అగ్రి సెస్ సంబంధిత అదనపు భారం పడదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ హామీ ఇచ్చినా, పెటట్రోల్‌ ధరలు  మరింత భారం కావాడం వినియోగదారులనుబెంబేలెత్తిస్తోంది.  కాగా బడ్జెట్‌లో పెట్రోల్ మీద రూ.2.50, డీజిల్ మీద 4 రూపాయల చొప్పున అగ్రి ఇన్‌ఫ్రా సెస్ విధిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు