పెట్రో మంట : సెంచరీ కొట్టేసింది

28 Jan, 2021 11:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:   ఇంధన ధరలు వినియోగదారులకు  చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా రికార్డులను నమోదు చేస్తున్నలీటరు పెట్రోల్ ధర 100 రూపాయలు దాటేసింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో 38 పైసలు పెంపుతో ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు రూ.101.80కు చేరుకుంది. రాజధాని జైపూర్‌లో లీటరు పెట్రోలు ధర రూ .93.86,  డీజిల్ ధర 85.94 లు పలుకుతోంది. రాజస్థాన్ అంతటా, పెట్రోల్ 93 రూపాయలకు ఎగువన,  డీజిల్ ధర రూ.85 కంటే ఎక్కువగానే ఉండటం విశేషం. 

గురువారం నాటికి ఢిల్లీలో సాధారణ పెట్రోలు రేటు రూ. 86.30, లీటర్‌ డీజిల్‌ ధర రూ. 76.48
చెన్నై: పెట్రోలు ధర లీటరుకు  రూ. 88.82, డీజిల్‌  ధర రూ. 81. 71
జైపూర్‌ : పెట్రోలు ధర లీటరుకు రూ.  93.86, డీజిల్‌ ధర రూ. 85.94
 
హైదరాబాద్‌ : పెట్రోలు ధర లీటరుకు రూ. 89.77, డీజిల్‌ ధర రూ. 83.46
అమరావతి : పెట్రోలు ధర లీటరుకు రూ.  92.54. డీజిల్‌ ధర రూ. 85.73

వ్యాట్‌లో తేడాలు కారణంగా ఆయా రాష్ట్రాల్లో పెట్రో ధరలు భిన్నంగా ఉంటాయి. 2020 మేలో రాజస్థాన్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ధరలపై వ్యాట్ 28 శాతం ఉండగా, పెట్రోల్‌పై వ్యాట్ 38 శాతంగా ఉంది. పొరుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌పై 20 శాతం నుంచి 33 శాతం, డీజిల్‌పై 16 శాతం నుంచి 23 శాతం  వ్యాట్‌ అమల్లో ఉండగా,  రాజస్థాన్‌లో ఇతర రాష్ట్రాల కంటే పెట్రోల్, డీజిల్ 4- 8 నుంచి 10 -11 రూపాయలు ఎక్కువ. 

మరిన్ని వార్తలు