దేశ రాజధాని న్యూఢిల్లీలో భూకంపం

28 Jan, 2021 11:54 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో భూకంపం వచ్చింది. అయితే భూకంప తీవ్రత చాలా తక్కువగా ఉండడంతో ప్రమాదమేమీ జరగలేదు. గురువారం ఉదయం 9.17 గంటలకు పశ్చిమ ఢిల్లీలో కొంత భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సీఎస్‌) ప్రకటించింది. రిక్టర్‌ స్కేలుపై దాని తీవ్రత 2.8గా నమోదయ్యిందని వెల్లడించింది. భూకంప కేంద్ర ఢిల్లీకి వాయవ్యంలో ఉందని ఎన్‌సీఎస్‌ అధికారులు ప్రకటించారు.

భూంకంపంతో భూ అంతర్భాగంలో 15 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని అధికారులు తెలిపారు. అయితే ఈ స్వల్ప భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణనష్టాలకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదని చెప్పారు. ఢిల్లీలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. గతంలోనూ ఢిల్లీలో స్వల్ప భూకంపాలు సంభవించాయి. గురువారం వచ్చిన భూంకంపంపై ఇంకా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు