లోకల్‌ ఆర్టిస్టులకు గుడ్‌న్యూస్‌: వింక్‌ మ్యూజిక్‌ రూ.100 కోట్ల పెట్టుబడి 

13 Aug, 2022 11:02 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సంగీతంలో ప్రతిభ కలిగిన వారిని ప్రోత్సహించేందుకు ఎయిర్‌టెల్‌కు చెందిన వింక్‌ మ్యూజిక్‌ రూ.100 కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించింది. స్వతంత్య్ర కళాకారుల కోసం పంపిణీ విభాగంలోకి ప్రవేశించనున్నట్టు వెల్లడించింది. ‘ఔత్సాహిక సంగీత కళాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడమేగాక సంపాదించుకోవచ్చు.

చదవండి:  ఇన్‌స్టాలో కొత్త అవతార్‌, స్నాప్‌చాట్‌లో స్పెషల్‌ ఫీచర్లు

వింక్‌ వేదిక ద్వారా ప్రపంచవ్యాప్తంగా 5,000 మంది ఆర్టిస్టులను ఏడాదిలో పరిచయం చేయాలని లక్ష్యంగా చేసుకున్నాం. ప్రస్తుతం 100 మంది ఉన్నారు. భారత్‌లో ప్రజాదరణ పొందిన పాటల్లో 30 శాతం స్వతంత్య్ర కళాకారులవే. పరిశ్రమను భవిష్యత్‌లో నడిపించేది వీరే. భారతీయులు వారంలో సగటున 21 గంటలు సంగీతం వింటున్నారు. ప్రపంచ సగటు 18 గంటలు ఉంది’ అని ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ సీఈవో అదర్శ్‌ నాయర్‌ తెలిపారు.  

చదవండి: Maruti Suzuki Swift S-CNG వచ్చేసింది, ఫీచర్లు చూసి వావ్‌ అనాల్సిందే!

మరిన్ని వార్తలు