జీవితాంతం వర్చువల్‌గానే..! ఎక్కడనుంచైనా పనిచేయండి..!ఉద్యోగులకు బంపర్‌ఆఫర్‌..!

2 Oct, 2021 16:23 IST|Sakshi

కరోనా రాకతో ఉద్యోగులు పూర్తిగా   ఇంటికే పరిమితమైనా విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుంది. కోవిడ్‌-19 ఉదృత్తి కాస్త తగ్గిపోవడంతో పలు కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రావాలని పిలుస్తున్నారు. మరికొన్ని కంపెనీలు కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ పూర్తైన ఉద్యోగులు కార్యాలయాలకు కచ్చితంగా రావాలని హుకుంను జారీ చేశాయి. 

ఆఫీస్‌లకు అవసరం లేదు కానీ...!
తాజాగా ప్రముఖ అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ  ప్రైజ్‌వాటర్‌హౌజ్‌కూపర్స్‌(పీడబ్ల్యూసీ) తన కంపెనీలో పనిచేసే 40  వేల యూఎస్‌ క్లయింట్‌ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది.   ఉద్యోగులు జీవితాంతం ఆఫీస్‌లకు రానవసరం లేకుండా ఎక్కడినుంచైనా వర్చువల్‌గా పనిచేయవచ్చునని పీడబ్ల్యూసీ ఒక ప్రకటనలో తెలిపింది. పీడబ్య్లూసీ కాకుండా  ఇతర ప్రధాన అకౌంటింగ్ సంస్థలు, డెలాయిట్ , కేపీఎమ్‌జీ కూడా, కోవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో ఉద్యోగులను రిమోట్‌గా పనిచేసేందుకు అవకాశాలను కల్పిస్తున్నాయి.  
చదవండి: నాడు కాలినడక.. నేడు అపరకుబేరుడు!

పీడబ్య్లూసీ డిప్యూటీ పీపుల్ లీడర్, యోలాండా సీల్స్-కాఫీల్డ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... క్లయింట్ సర్వీస్ ఉద్యోగుల కోసం పూర్తి సమయం వర్చువల్ వర్క్ అందించే తొలి సంస్థగా పీడబ్ల్యూసీ నిలిచిందన్నారు. హ్యూమన్‌ రిసోర్స్‌, అకౌంటింగ్‌ విభాగాల్లో ఉద్యోగులు ఇప్పటికే దాదాపు పూర్తి సమయం పనిచేసే అవకాశాన్ని కలిగి ఉన్నారు. 

వర్చువల్‌గా పనిచేసే ఉద్యోగులు ఒక నెలలో మూడు రోజుల పాటు కచ్చితంగా  ముఖ్యమైన క్లయింట్‌ మీటింగ్‌లకోసం, లెర్నింగ్‌ సెషన్ల కోసం ఉద్యోగులు కచ్చితంగా ఆఫీసులకు రావాలనే షరతును  తప్పనిసరిగా కార్యాలయానికి రావాల్సి ఉంటుందని కంపెనీ డిప్యూటీ లీడర్‌ సీల్స్-కాఫీల్డ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వర్చువల్‌ ఉద్యోగాలను చేస్తున్నవారి వేతనాల పెంపుకు అడ్డంకిగా మారేలా ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ సంస్థ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 284,000 మంది పనిచేస్తోంది. 
చదవండి: ఆనంద్‌ మహీంద్రా, రాకేశ్‌ జున్‌జున్‌వాలా..అతని తర్వాతే..!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు