అవుట్‌ సోర్సింగ్‌ పాలసీపై గైడ్‌లైన్స్‌ విడుదల

29 Jun, 2021 08:08 IST|Sakshi

కోపరేటివ్‌ బ్యాంకులకు ఆదేశాలు

ముంబై: కీలకమైన నిర్వహణ సేవలను అవుట్‌సోర్స్‌ (ఇతరులకు అప్పగించడం) చేయరాదంటూ కోపరేటివ్‌ బ్యాంకులను (సహకార బ్యాంకులు) ఆర్‌బీఐ ఆదేశించింది. ‘‘కోపరేటివ్‌ బ్యాంకులు ఆర్థిక సేవలను అవుట్‌సోర్స్‌ చేసుకోవచ్చు. కానీ, కీలక నిర్వహణ విధులైన.. విధానాల రూపకల్పన, ఇంటర్నల్‌ ఆడిట్, నిబంధనల అమలు, కేవైసీ నిబంధనల అమలు, రుణాల మంజూరు, పెట్టుబడుల నిర్వహణ సేవలను ఇతరులకు అప్పగించొద్దు’’ అని ఆర్‌బీఐ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

కోపరేటివ్‌ బ్యాంకులు ఆర్థిక సేవలను అవుట్‌సోర్స్‌ చేసే విషయంలో రిస్క్‌ నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. రిస్క్‌ పర్యవేక్షణ కోసం నిపుణులను (మాజీ ఉద్యోగులు సైతం) నిబంధనల మేరకు నియమించుకోవడానికి వీలు కల్పించింది. అవుట్‌సోర్స్‌ అంటే.. కోపరేటివ్‌ బ్యాంకుల కార్యకలాపాలను మూడో పక్షం నిర్వహించడంగా స్పష్టత ఇచ్చింది. వ్యయాలను తగ్గించుకునేందుకు, నిపుణుల సేవలను పొందేందుకు కోపరేటివ్‌ బ్యాంకులు పలు కార్యకలాపాలను అవుట్‌సోర్స్‌ ఇస్తుంటాయి. ఇలా సేవలను వేరే వారికి అప్పగించే విషయంలో వచ్చే సమస్యలను ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకుని ఈ మేరకు నిబంధనలను తీసుకొచ్చింది.    

చదవండి: ప్రభుత్వ రంగ సంస్థల్లో లక్ష్యం దిశగా పెట్టుబడుల ఉపసంహరణ

మరిన్ని వార్తలు