కరూర్‌ వైశ్యా బ్యాంక్‌పై ఆర్బీఐ కొరడా! రూ.30 లక్షల జరిమానా..

24 Mar, 2023 19:00 IST|Sakshi

ప్రైవేట్‌ రంగ కరూర్‌ వైశ్యా బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఝులిపించింది. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినందుకు భారీ జరిమానా విధించింది. మోసం వర్గీకరణ, రిపోర్టింగ్‌కు సంబంధించి తమ ఆదేశాలను పాటించడంలో కరూర​్‌ వైశ్యా బ్యాంక్ విఫలమైందని ఆర్బీఐ తనిఖీలో వెల్లడైంది. దీంతో మార్చి 24న రూ.30 లక్షల జరిమానా విధించింది.

ఇదీ చదవండి: ధూమ్‌మచాలే.. హీరో కరిజ్మా మళ్లీ వస్తోంది!

ఆర్బీఐ సెలెక్ట్ స్కోప్ ఇన్‌స్పెక్షన్ (ఎస్‌ఎస్‌ఐ) నిర్వహించగా కరూర్‌ వైశ్యా బ్యాంక్‌లో కొన్ని ఫ్రాడ్‌ అకౌంట్లను గుర్తించింది. వాటికి సంబంధించిన వివరాలను వారం రోజుల్లోగా అందించాలని జాయింట్ లెండర్స్ ఫోరమ్ (జేఎల్‌ఎఫ్‌) నిర్దేశించగా అందులో కరూర్‌ వైశ్యా బ్యాంక్ విఫలమైందని ఆర్బీఐ పేర్కొంది.

ఇదీ చదవండి: వరల్డ్‌ బ్యాంక్‌ కాబోయే ప్రెసిడెంట్‌కు కోవిడ్‌.. భారత్‌లో సమావేశాలన్నీ రద్దు!

తాము జారీ చేసిన ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు గానూ ఎందుకు జరిమానా విధించకూడదో చెప్పాలని కరూర్‌ వైశ్యా బ్యాంకుకు ఆర్బీఐ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన సమాధానం, విచారణ సమయంలో చేసిన సమర్పణలను పరిగణనలోకి తీసుకున్న తరువాత తమ ఆదేశాలను సదరు బ్యాంక్‌ పాటించలేదని నిర్ధారణకు వచ్చి జరిమానా విధించినట్లు ఆర్బీఐ పత్రికా ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని వార్తలు