కరోనా సెకండ్‌ వేవ్‌ : ఆర్‌బీఐ కీలక నిర్ణయం

4 Jun, 2021 10:14 IST|Sakshi

ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లు యథాతథం

రెపో రేటు 4 శాతం

రివర్స్‌ రెపో రేటు 3.35 శాతం

సాక్షి, ముంబై: కరోనా సెకండ్‌ వేవ్‌  విలయం నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంకు కీలక వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. విస్తృత అంచనాకు అనుగుణంగానే ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లు యథాతథంగానే ఉంచింది. దీని ప్రకారం రెపో రేటు 4 శాతం వద్ద, రివర్స్‌ రెపో రేటు 3.35 శాతంగా ఉండనుంది.  గవర్నర్ శక్తికాంత దాస్‌ నేతృత్వంలో పాలసీ కమిటీ మూడు రోజుల సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది.  

2022 ఆర్థిక సంవత్సరానికి గాను సీపీఐ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉండనుందని ఆర్‌బీఐ అంచనా వేసింది.  ఈ సందర్భంగా జీ-సాప్ ‌2.0 ను శక్తికాంత దాస్‌ ప్రకటించారు. జూన్ 17న రూ.40వేల కోట్ల మేర సెక్యూరిటీలు కొనుగోలు చేస్తామన్నారు.  ఫారిన్ కరెన్సీ రిజర్వ్‌లు 600 బిలియన్ డాలర్లకు చేరిందని, ఫలితంగా కరెన్సీ ఒడిదుడుకులు, ఇతర పరిణామాలను సమర్ధవంతంగా ఎదుర్కోగలమని ఆయన చెప్పారు. అలానే దేశ జీడీపీని 9.5శాతంగా అంచనా వేశారు. దేశంలో గ్రామీణ ప్రాంతంలో వినియోగ సంబంధింత డిమాండ్ మెరుగ్గా ఉండనుందనే ఆశాభావాన్ని గవర్నర్‌ వ్యక్తం చేశారు. ఇందుకుసకాలంలో వచ్చిన మాన్‌సూన్‌ నిదర్శనమన్నారు. ఆర్థిక వృద్ధికి అవసరమైన సంకేతాలు తగ్గినట్లు కన్పిస్తున్నా, గత ఏడాది కంటే ఎక్కువగానే ఉన్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ వేగవంతం కావడంతో పాటు ఇప్పటికే ప్రకటించిన అనేక ఉద్దీపన ప్యాకేజీలు ఆర్థిక పురోగమనానికి దోహదపడతాయని చెప్పారు. అలాగే కరోనా నేపథ్యంలో హాస్పిటల్ రంగానికి రూ.15,000 కోట్లను ప్రకటించారు. ఎంఎస్ఎంఈలకు గతంలో ఇచ్చినట్లుగా రూ.16 వేల కోట్ల రుణాలు మంజూరు చేసేందుకు, ఆర్ధికంగా లిక్విడిటీ అందుబాటులోకి తెస్తున్నట్లు  వెల్లడించారు.

చదవండి :  Petrol, Diesel Price: మళ్లీ పెట్రో షాక్‌!
దీర్ఘాయుష్షు: మనిషి 120 సంవత్సరాలు జీవించవచ్చు!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు