Sakshi News home page

ఆర్‌బీఐ అండతో మళ్లీ రికార్డుల మోత

Published Sat, Dec 9 2023 5:32 AM

Nifty hits 21k as RBI keeps repo rate unchanged - Sakshi

ముంబై: ఆర్‌బీఐ ద్రవ్య విధాన వైఖరి మెప్పించడంతో స్టాక్‌ మార్కెట్లో మళ్లీ రికార్డుల మోత మోగింది. రిజర్వ్‌ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023 –24) వృద్ధి రేటు అంచనాలు పెంచడం, వరుసగా అయిదోసారి కీలక వడ్డీ రేట్ల జోలికెళ్లకపోవడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ఫలితంగా వడ్డీ రేట్ల ఆధారిత బ్యాంకులు, ఫైనాన్స్‌ సరీ్వసులు, రియల్టీ షేర్లకు భారీ డిమాండ్‌ లభించడంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడే, ముగింపులోనూ కొత్త రికార్డులు నమోదు నమోదు చేశాయి.

సెన్సెక్స్‌ 304 పాయింట్లు లాభపడి 69,826 వద్ద వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు పెరిగి 20,969 వద్ద స్థిరపడ్డాయి. ఉదయం సూచీలు స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి కమిటీ సమీక్షా సమావేశ నిర్ణయాలు వెల్లడి(ఉదయం 10 గంటలు) తర్వాత కొనుగోళ్లు మరింత పెరిగాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశలో సెన్సెక్స్‌ 372 పాయింట్లు బలపడి 69,894 వద్ద, నిఫ్టీ 105 పాయింట్లు పెరిగి తొలిసారి 21 వేల స్థాయిపై 21,006 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి.  
► బ్లాక్‌ డీల్‌ ద్వారా 75.81 కోట్ల షేర్లు చేతులు మారినట్లు డేటా వెల్లడి కావడంతో జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇ్రన్ఫాస్ట్రక్చర్‌ షేరు 12% లాభపడి రూ.69 వద్ద ముగిసింది.

Advertisement

What’s your opinion

Advertisement