రెడ్‌మీ రికార్డు: రెండు వారాల్లోనే రూ.500 కోట్లు

1 Apr, 2021 21:41 IST|Sakshi

ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ రెడ్‌మీ రికార్డు సృష్టించింది. రెడ్‌మీ నోట్ 10 సిరీస్ మొదటి రెండు వారాల్లోనే భారతదేశంలో రూ.500 కోట్ల అమ్మకాలు జరిగినట్లు షియోమీ ప్రకటించింది. ఈ సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 10, రెడ్‌మీ నోట్ 10 ప్రో, రెడ్‌మీ నోట్ 10 ప్రో మాక్స్ మూడు ఫోన్లు తీసుకొచ్చింది. షియోమీ ఈ నెల ప్రారంభంలో ఈ సిరీస్‌ను భారతదేశంలో ఆవిష్కరించింది. ప్రతి ఫోన్ వరుసగా మార్చి 16, మార్చి 17, మార్చి 18న ఫస్ట్ సేల్ కు వెళ్లాయి. షియోమీ ఒక ప్రెస్‌నోట్ ద్వారా ఈ ఫోన్లకు సంబంధించిన అమ్మకాల వివరాలను షియోమీ ప్రకటిచింది. 

మార్చి 16 ఫస్ట్ సేల్ నుంచి ఇప్పటి వరకు మొత్తంగా రూ.500 కోట్ల స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జరిగాయి. ముఖ్యంగా రెడ్‌మీ నోట్ 10 మాత్రమే మార్చి 16వ తేదీన అమ్మకానికి వచ్చింది. రెడ్‌మి నోట్ 10 ప్రో మార్చి 17న, రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ మార్చి 18న అమ్మకాలు జరిగాయి. షియోమీ మొత్తం ఎన్ని యూనిట్లు విక్రయించిందో తెలపలేదు. కాబట్టి, భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన మూడు ఫోన్‌లలో ఏది అనేది అస్పష్టంగా ఉంది. అంచనా ప్రకారం, షియోమీ రెండు వారాల్లో 2,27,000 నుంచి 4,16,000 యూనిట్ల రెడ్‌మి నోట్ 10 సిరీస్ ఫోన్‌ల విక్రయించవచ్చు.

చదవండి:

రెడ్‌మి నోట్‌ 10 స్మార్ట్‌ఫోన్లు వచ్చేసాయ్‌!

మరిన్ని వార్తలు