స్మార్ట్‌ఫోన్ బొనాంజా: నిముషానికి ఎన్ని ఫోన్స్‌ కొన్నారో తెలుసా?

28 Sep, 2022 11:07 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నిముషానికి 1,100 మొబైల్‌ ఫోన్లు.. పండగల సీజన్‌ విక్రయాల్లో భాగంగా ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థల వేదికలపై నాలుగు రోజుల్లో అమ్ముడైన సంఖ్య ఇది. వీటి విలువ రూ.11,000 కోట్లు అని కన్సల్టెన్సీ కంపెనీ రెడ్‌సీర్‌ వెల్లడించింది.

‘సెప్టెంబర్‌ 22-25 మధ్య ఈ–కామర్స్‌ సంస్థలు రూ.24,500 కోట్ల వ్యాపారం నమోదు చేశాయి. సేల్‌-1 అంచనా విక్రయాల్లో ఇది 60 శాతం. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్, అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్, మీషో మెగా బ్లాక్‌బస్టర్‌ సేల్‌తోపాటు మింత్రా, అజియో, నైకా తదితర వేదికలు సేల్‌-1లో ఉన్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే ఫ్యాషన్‌ విభాగం నాలుగున్నర రెట్లు అధికంగా అమ్మకాలు జరిగి రూ.5,500 కోట్లకు చేరుకున్నాయి’ అని వివరించింది.   

మరిన్ని వార్తలు