రూపాయి హై జంప్‌: కారణం ఇదే!

22 Sep, 2023 16:15 IST|Sakshi

Rupee rises దేశీయ కరెన్సీ  రూపాయి డాలరు మారకంలో శుక్రవారం ఒక రేంజ్‌లో పుంజుకుంది. ఆరంభంలోనే  38 పైసలు పెరిగి 82.75 స్థాయిని తాకింది. చివరికి 19 పైసల లాభంతో  82.93 వద్ద ముగిసింది. గురువారం  2 పైసలు తగ్గి 83.13 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. 

ముఖ్యంగా జేపీ మోర్గాన్ బాండ్ ఇండెక్స్‌లో భారతదేశాన్ని చేర్చడం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. 2024 , జూన్ నుంచి  అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల బాండ్ ఇండెక్స్‌లో భారత ప్రభుత్వ బాండ్లను (IGBs) చేర్చనున్నట్లు ప్రకటించింది. దీన్ని ఆర్థికమంత్రిత్వ శాఖ స్వాగతించింది.  (సాక్షి మనీ మంత్రా: వరుస నష్టాలతో కుదేలైన నిఫ్టీ)

ప్రధాన గ్లోబల్ బాండ్ ఇండెక్స్‌లో భారతదేశాన్ని చేర్చడం వల్ల దేశ రుణ మార్కెట్లో విదేశీ పెట్టుబడులు ప్రవాహం భారీగా పెరగనుందని అంచనా. భారత ప్రభుత్వ బాండ్లను , బెంచ్‌మార్క్ ఎమర్జింగ్-మార్కెట్ ఇండెక్స్‌లో చేర్చాలని జేప్‌ మోర్గాన్ చేజ్ & కో తీసుకున్న నిర్ణయం, భారతదేశ డెట్ మార్కెట్  గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షి‍స్తుందని ఫారెక్స్ వ్యాపారులు భావిస్తున్నారు.  రూపాయి  ఎన్‌డిఎఫ్ మార్కెట్లలో సుమారు 0.42 శాతం వృద్ధి చెంది 82.80 స్థాయిలకు చేరుకోవడం మంచి పరిణామమని నిపుణులు పేర్కొంటున్నారు. (దేశంలోని  ప్రధాన నగరాల్లో బంగారం ధరల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభ  లాభాలను నిలబెట్టుకోవడంలో విఫలమైనాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య సెన్సెక్స్‌ 221 పాయింట్లు నష్టపోగా,నిఫ్టీ 19700 దిగువన స్థిరపడింది. అటు  ఆరు కరెన్సీల బాస్కెట్‌తో గ్రీన్‌బ్యాక్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.12 శాతం పెరిగి 105.48కి చేరుకుంది. ప్రపంచ చమురు బెంచ్‌మార్క్  బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.61 శాతం పెరిగి 93.87 డాలర వద్ద ఉంది. విదేశీ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) గురువారం క్యాపిటల్ మార్కెట్‌లో నికర అమ్మకం దారులుగా ఉన్నారు. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం వారు రూ3,007.36 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. (క్యాబ్‌ డ్రైవర్‌ ఖాతాలో ఏకంగా రూ. 9 వేల కోట్లు..ఏం చేశాడంటే?)

మరిన్ని వార్తలు