Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ ఖాతాలో మరో అరుదైన ఘనత...!

14 Oct, 2021 07:54 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ కరెన్సీ వాడకం జోరు మీద ఉంది. పలు దేశాలు ప్రజలు డిజిటల్‌ కరెన్సీలను భారీగా ఆదరిస్తున్నారు. క్రిప్టోకరెన్సీలో బిట్‌కాయిన్‌, ఈథిరియం, డోగ్‌ కాయిన్‌ వంటివి అత్యంత ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరో డిజిటల్‌ టోకెన్‌ అందరినీ ఆకర్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీకి సమానంగా  నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్స్‌(ఎన్‌ఎఫ్‌టీ)పై కూడా ఆసక్తి పెరుగుతుంది. 
చదవండి:  ప్రపంచదేశాల నెత్తిమీద భారీ పిడుగువేసిన రష్యా అధ్యక్షుడు..! 

బిగ్‌ బీ.. ఇప్పుడెమో సల్మాన్‌ ఖాన్‌....!
భారత్‌ లాంటి దేశాల్లో కూడా ఎన్‌ఎఫ్‌టీ టెక్నాలజీ దూసుకుపోతుంది. ఎన్‌ఎఫ్‌టీలపై ఇండియన్స్‌ కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు. భారత్‌లో ఎన్‌ఎఫ్‌టీను పరిచయం తొలి వ్యక్తిగా అమితాబ్‌ బచ్చన్‌ నిలిచాడు. తరువాతి స్థానంలో బేబి డాల్‌ సన్ని లియోన్‌ నిలిచింది. తాజాగా ఎన్‌ఎఫ్‌టీ లోకి సల్మాన్‌ ఖాన్‌ కూడా వస్తోన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సల్మాన్‌ ఖాన్‌ తన ఎన్‌ఎఫ్‌టీ కలెక్షన్లను బాలీకాఇయిన్‌. కామ్‌ అందుబాటులో ఉంటాయని ట్విటర్‌ ద్వారా తెలిపారు.

సల్మాన్‌ ఖాన్‌ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో...  “ఆ రహా హూన్ మెయిన్, ఎన్‌ఎఫ్‌టీ లేకే.... సల్మాన్ ఖాన్ స్టాటిక్ NFT కమింగ్‌ అన్‌ bollycoin.com స్టే ట్యూన్‌ బాయ్‌ లోగ్‌ అంటూ..ట్విట్‌ చేశాడు. బాలీకాయిన్‌ ఎన్‌ఎఫ్‌టీ కలెక్షన్‌ వెబ్‌సైట్‌ను ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, నిర్మాత, దర్మకుడు అతుల్‌ అగ్నిహోత్రి ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్‌లో ప్రముఖ చలనచిత్రాల ఐకానిక్ డైలాగ్‌లు, పోస్టర్‌లు, రేర్‌ ఫుటేజ్‌లు, సోషల్ మీడియా కంటెంట్, సెలబ్రిటీల వస్తువులు, వారి స్టిల్స్‌ ఎన్‌ఎఫ్‌టీ రూపంలో అభిమానులను లభించనున్నాయి.

ప్రముఖుల ఎన్‌ఎఫ్‌టీ సేకరణలు ఈథిరియం బ్లాక్‌చెయిన్‌లో విక్రయించబడతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలీవుడ్ అభిమానులు తమ ఇష్టపడే బాలీవుడ్ చిత్రాల ఎన్‌ఎఫ్‌టీలను సొంతం చేసుకునేందుకు ఒక వేదికను బాలీకాయిన్‌. కామ్‌ అందించనుంది.

ఎన్‌ఎఫ్‌టీ అంటే..
ఎన్‌ఎఫ్‌టీ అంటే డిజిటల్‌ ఆస్తులు. సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు, వీడియోలను సైతం డిజిటల్‌ ఫార్మాట్‌లోకి మార్చి బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్‌ వర్క్‌ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీలకు సంబంధించిన ఈ డిజిటల్‌ ఎస్సెట్స్‌, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వాటిని వారు తిరిగి  వేలం కూడా వేసుకోవచ్చును.


చదవండి: సన్నీలియోన్‌ అరుదైన ఫీట్‌.. తన ఎన్‌ఎఫ్‌టీ కలెక్షన్స్‌తో వేలం

>
మరిన్ని వార్తలు