ఆ రోజు మీటింగ్‌‌లో కూడా సత్య నాదెళ్లకు అదే ధ్యాస..

2 Dec, 2023 18:50 IST|Sakshi

ఇటీవల జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు ఏకంగా అహ్మదాబాద్ స్టేడియానికి వెళ్లారు. మరికొందరు టీవీలకు, స్మార్ట్‌ఫోన్‌లకు అతుక్కుపోయి లైవ్ చూడటం మొదలెట్టసారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ళ' (Satya Nadella) సైతం మ్యాచ్ మిస్ చేసుకోలేదని తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగే రోజు ఏఐ ప్రాజెక్టుకి సంబంధించి ఒక ముఖ్యమైన మీటింగ్‌లో ఉన్నారు, అయినప్పటికీ మధ్య మధ్యలో ఫైనల్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడం, విరాట్ కోహ్లీ ప్రదర్శన ఎలా ఉందనే విషయాలను తెలుసుకుంటూనే ఉన్నట్లు ఆంగ్ల మీడియా సంస్థ న్యూయార్కర్ వెల్లడించింది.

న్యూజిలాండ్‌, భారత్‌ మధ్య జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ను కూడా రాత్రంగా మేల్కొని మరీ చూసినట్లు సత్య నాదెళ్ల ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఇదీ చదవండి: మొన్న విప్రో.. నేడు హెచ్‌సీఎల్ - ఎందుకిలా?

ఈ ఇంటర్వ్యూలోనే టీమ్ ఇండియా ఓటమికి ప్రతీకారంగా ఆస్ట్రేలియాను కొంటారా? అంటూ సత్య నాదెళ్లను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఓపెన్‌ఏఐని కొనుగోలు చేయడం, ఆస్ట్రేలియాను కొనడం రెండూ ఒకటి. ఈ రెండింటీలో ఏదీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఓపెన్‌ఏఐతో భాగస్వామిగా ఉండటంతోపాటు ఆసీస్ క్రికెట్‌ను కూడా ఆ‍స్వాదిస్తామంటూ సమాధాన మిచ్చారు. దీంతో భారతీయ  క్రికెట్‌ ఫ్యాన్స్‌ తెగ ఆనందపడిపోయారు.

మరిన్ని వార్తలు